IND Vs SA: తొలి టెస్టులో భారత్ ఘోర ఓటమి
సౌతాఫ్రికాతో భారత్ తొలి టెస్టులో ఘోర పరాభవాన్ని చవిచూసింది.
By Srikanth Gundamalla Published on 28 Dec 2023 9:30 PM ISTIND Vs SA: తొలి టెస్టులో భారత్ ఘోర ఓటమి
సౌతాఫ్రికాతో భారత్ తొలి టెస్టులో ఘోర పరాభవాన్ని చవిచూసింది. తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో భారత్ పై గెలిచింది. ఓవర్ నైటు స్కోరు 256/5తో మూడో రోజు ఆట ప్రారంభించిన సౌతాఫ్రికా.. 408 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 436 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఇక ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 131 పరుగులకే ఆలౌట్ అయ్యింది. విరాట్ కోహ్లీ (76) ఒంటరి పోరాటం మినహా 8 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే ఔట్ అయ్యారు. దక్షిణాప్రికా బౌలర్లలో బర్గర్ 4 వికెట్లు తీయగా.. రబాడ 2 చొప్పున వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 245 పరుగులకు ఆలౌట్ అయ్యిన విషయం తెలిసిందే.
సౌతాఫ్రికా గడ్డపై విరాట్ కోహ్లీ రికార్డు:
తొలి టెస్టు సందర్భంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డను అందుకున్నాడు. సఫారీలతో టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. తద్వారా టీమిండియా మాజీ ఆటగాడు సేహ్వాగ్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. బాక్సింగ్ డే టెస్టులో భాగంగా మూడో రోజు ఆట సందర్భంగా గురువారం ఈ ఫీట్‌ను అందుకున్నాడు విరాట్ కోహ్లీ. సౌతాఫ్రికాతో వారి సొంతగడ్డపై భారత్ రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. తొలి టెస్టులో కోహ్లీ చేసిన పరుగులు 38.
రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడిన కోహ్లీ 33 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ రికార్డును అందుకున్నాడు. సెహ్వాగ్ పేరిట(15 టెస్టుల్లో 1306 పరుగులు) ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. అయితే.. సౌతాఫ్రికాతో టెస్టుల్లో సచిన్ టెండూల్కర్ (24 టెస్టుల్లో 1741 రన్స్) చేసి తొలి స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు విరాట్ సౌతాఫ్రికాతో టెస్టుల్లో చేసిన పరుగులు 1236. సెంచూరియన్ టెస్టులో ఇప్పటికే విరాట్ హాఫ్ సెంచరీ దాటేశాడు. 61 బంతుల్లో 53 పరుగులు చేశాడు.