ఆ రూల్స్ ఏంటో.. పాయింట్స్ పద్దతేంటో అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కోహ్లీ
Virat Kohli takes a dig at ICC for changing World Test Championships points. పీసీటీ(పర్సటైంజ్ ఆఫ్ పాయింట్స్) విధానంపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.
By Medi Samrat Published on 10 Feb 2021 12:22 PM GMTభారత జట్టు తర్వాతి టార్గెట్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ అన్నది అందరికీ తెలిసిందే..! అందులో భాగంగానే భారత్ అద్భుతమైన విజయాలు సాధించుకుంటూ వెళుతోంది. కానీ ఐసీసీ కొత్త నిబంధనలు భారత్ కు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ నుండి దూరం అయ్యేలా చేస్తున్నాయి. చెన్నై టెస్టు విజయం ఇంగ్లండ్ ను వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిపింది. భారత్ ఈ పట్టికలో నాలుగోస్థానానికి పడిపోయింది.
పీసీటీ(పర్సటైంజ్ ఆఫ్ పాయింట్స్) విధానంపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌కు సంబంధించి పర్సంటైల్ రూల్స్ ఎలా మారుస్తారని కోహ్లీ ప్రశ్నించాడు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ కాలంలో ఎలాంటి మ్యాచ్‌లు జరగకపోవడంతో భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ఆధ్వర్యంలో ఐసీసీ ఒక కమిటీని నిర్వహించింది. పీసీటీ ఆధారంగా జట్ల స్థానాలు మారే అవకాశం ఉంటాయని నిర్ణయం తీసుకున్నారు. కోహ్లీ మాట్లాడుతూ పరిస్థితులు అదుపులో లేనప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నారు.. ఇప్పుడు అంతా బాగానే ఉంది.. అలాంటప్పుడు రూల్స్ కూడా మారాలి కదా అని ప్రశ్నించాడు. ఇదంతా మీ చేతుల్లోనే ఉందని అసహనాన్ని వ్యక్తం చేశాడు. మ్యాచ్‌లు ఓడిపోవడం, గెలవడం సహజమేనని మేం పాయింట్ల గురించి అంతగా బాధపడడం లేదని అన్నాడు కోహ్లీ. కొన్ని విషయాల్లో లాజిక్ లేకుండా రూల్స్ మారుస్తూ నిర్ణయాలు తీసుకోవడం కోపం తెప్పించిందని చెప్పుకొచ్చాడు.
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్స్ చేరే అవకాశాలను ఇంగ్లండ్ మరింత మెరుగుపర్చుకుంది. భారత్ తో ఇంకా 3 టెస్టులు ఆడాల్సి ఉండగా, వాటిలో రెండు గెలిస్తే లార్డ్స్ వేదికగా జరిగే వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్ లో ఆడుతుంది. భారత్ కూడా ఈ సిరీస్ లో రెండు టెస్టులు గెలిస్తే టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్ బెర్తును ఖరారు చేసుకుంటుంది. ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఆరో సిరీస్ ఆడుతున్న ఇంగ్లండ్.. 11 విజయాలు, 4 ఓటములు, 3 డ్రాలతో మొత్తం 70.2 శాతం పర్సెంటేజీ పాయింట్లతో అగ్ర స్థానంలో ఉంది. ఆరో సిరీస్ ఆడుతున్న భారత్.. 9 గెలిచి, 4 ఓడి, ఒకటి డ్రా చేసుకుంది. మొత్తం 68.3 శాతం పర్సెంటేజీ పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. రెండు, మూడు స్థానాల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి. కరోనా నేపథ్యంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య సిరీస్ వాయిదా పడడంతో వరల్డ్ టెస‍్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది.