బోర్డర్-గవాస్కర్ ట్రీఫీలో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న నాలుగో మరియు చివరి టెస్టులో 4వ రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 3/0 స్కోరుతో ఉంది. ట్రావిస్ హెడ్(3), మాథ్యూ కుహ్నెమాన్(0) పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు విరాట్ కోహ్లీ 186 పరుగులు చేయడంతో భారత్ 571 పరుగులు వద్ద ఇన్నింగ్సు ముగించింది. మర్ఫీ బౌలంగ్‌లో అవుటైన కోహ్లీ తృటిలో డబుల్ సెంచరీ మిస్ అయ్యాడు. ఆదివారం ఉదయం 289/3 వద్ద ఇన్నింగ్సు ప్రారంభించిన భారత్.. ఆస్ట్రేలియాపై తొలి ఇన్నింగ్స్‌లో 91 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్సులో 480 పరుగులు సాధించింది. కోహ్లి మారథాన్ ఇన్నింగ్సుకు.. శుభమాన్ గిల్(128) అక్సర్ పటేల్ (79 పరుగులు) తోడవ్వడంతో భారత్ భారీస్కోరు సాధించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లియాన్, టాడ్ మర్ఫీలు చెరో మూడు వికెట్లు తీశారు. మాథ్యూ కుహ్నెమాన్, మిచెల్ స్టార్క్ కు ఒక్కో వికెట్ దక్కింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్సులో ఉస్మాన్ ఖవాజా, క్రిస్ గ్రీన్‌లు సెంచరీలతో రాణించారు. ఆట ఐదవరోజు ఏదైనా అద్భుతం జరిగితే తప్పా.. ఫలితం తేలదు. లేదంటే డ్రా గా ముగిసే అవకావాలు ఎక్కువగా ఉన్నాయి. నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉంది.