అశ్విన్ చేసిన పనికి.. పగలబడి నవ్విన కోహ్లీ

R Ashwin Rattles Steve Smith At Non-Striker's End, Virat Kohli's Reaction Can't Be Missed. రవి చంద్రన్ అశ్విన్ బౌలింగ్ అంటే చాలు.. బ్యాటింగ్ చేస్తున్న వాళ్లే కాదు

By M.S.R
Published on : 19 Feb 2023 6:30 PM IST

అశ్విన్ చేసిన పనికి.. పగలబడి నవ్విన కోహ్లీ

రవి చంద్రన్ అశ్విన్ బౌలింగ్ అంటే చాలు.. బ్యాటింగ్ చేస్తున్న వాళ్లే కాదు, నాన్ స్ట్రైక్ లో ఉన్న వాళ్లు కూడా ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలి. ఎందుకంటే మనోడు ఎంతో సింపుల్ గా మన్కడింగ్ కూడా చేసేస్తాడు. అయితే ఈ మధ్య కాలంలో చెయ్యడం లేదు కానీ.. గతంలో అతడి దెబ్బకు మ్యాచ్ స్వరూపాలే మారిపోయాయి.

ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో 3వ రోజున ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్‌ కూడా అశ్విన్ దెబ్బకు షాకయ్యాడు. మార్నస్ లబుషేన్ కి బౌలింగ్ చేసిన అశ్విన్, రెండో ఇన్నింగ్స్ 15వ ఓవర్ సమయంలో బంతిని విడుదల చేయకుండా నాన్ స్ట్రైకర్ స్మిత్ వైపు చూశాడు. స్మిత్‌ను రనౌట్ చేసే ప్రయత్నం చేయనప్పటికీ, మొత్తం సంఘటన పట్ల అందరూ నవ్వుకున్నారు. అశ్విన్ బాల్ వేయడానికి ముందుకు రాగానే స్మిత్ కూడా అలవాటుగా క్రీజు దాటి ముందుకు వచ్చాడు. అయితే ఈ సమయంలో బంతిని వేయబోయిన అశ్విన్.. రిలీజ్ చేయకుండా స్మిత్ వైపు చూశాడు. అది చూసిన స్మిత్ వెంటనే వెనక్కు తిరిగి క్రీజులోకి పరిగెత్తాడు. ఆ తర్వాత అశ్విన్ నవ్వుతూ మళ్లీ బౌలింగ్ చేశాడు. ఆ సమయంలో ఒక్కడే స్లిప్ ఫీల్డర్‌గా ఉన్న కోహ్లి.. ఈ సంఘటన జరగడంతో పగలబడి నవ్వుతూ చప్పట్లు కొట్టడం ప్రారంభించాడు. స్ట్రైకర్ లబు షేన్ ముఖంలో కూడా చిరునవ్వు కనిపించింది.


Next Story