బస్‌లో క్రికెట‌ర్ల‌ హోలీ వేడుకలు.. వీడియో వైర‌ల్‌

Virat Kohli, Rohit Sharma Lead India's Holi Celebrations In Team Bus. ఆస్ట్రేలియాతో ఆఖరిదైన నాలుగో టెస్టులో తలపడేందుకు టీమిండియా సర్వం సిద్ధం చేసుకుంది

By Medi Samrat
Published on : 7 March 2023 8:15 PM IST

బస్‌లో క్రికెట‌ర్ల‌ హోలీ వేడుకలు.. వీడియో వైర‌ల్‌

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా గురువారం నుంచి అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో ఆఖరిదైన నాలుగో టెస్టులో తలపడేందుకు టీమిండియా సర్వం సిద్ధం చేసుకుంది. మూడో టెస్టులో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నప్పటికీ.. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు 2-1 ఆధిక్యంలో ఉంది. చివరి టెస్టుకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉండ‌గా.. దేశమంతా హోలీ పండుగకు సిద్ధమైంది. భారత జట్టు ఆటగాళ్లు కూడా హోళీని జరుపుకున్నారు. సెల‌బ్రేష‌న్స్‌కు సంబంధించి శుభ్‌మాన్ గిల్.. మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశాడు. దీనిలో టీమ్ బస్సులో హోలీని జరుపుకోవడం చూడవచ్చు.

విరాట్ కోహ్లీ కెమెరా ముందు రంగులు పూసుకున్న‌ ముఖంతో డ్యాన్స్ చేస్తుంటే.. రోహిత్ శర్మ అతని వెనుక నుండి గులాల్స్ విసురుతూ క‌నిపించాడు. మిగిలిన సహచరులు కూడా సెల‌బ్రేష‌న్స్‌లో ఉండ‌గా.. గిల్ వీడియో తీశాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. మొదటి రెండు టెస్టుల్లో ఓడిన తర్వాత.. ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా అద్భుతంగా ఆడి.. భారత్‌ను ఓడించి 1-2తో ఆధిక్యాన్ని తగ్గించింది. ప‌ర్య‌ట‌క‌ జట్లకు భారతదేశంలో విజయాలు చాలా అరుదు. ఆరేళ్ల తర్వాత భారత గడ్డపై మొదటి విజయాన్ని నమోదు చేసిన ఆస్ట్రేలియా రెట్టించిన ఆత్మ‌విశ్వాసంతో చివ‌రి టెస్టుకు సిద్ధ‌మ‌వుతోంది.


Next Story