ఏమైంది..? దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి వచ్చేసిన విరాట్ కోహ్లీ..!

ప్రస్తుతం భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. టీ20, వన్డే సిరీస్‌ల తర్వాత ఇరు జట్లు రెండు టెస్టుల సిరీస్‌లో త‌ల‌ప‌డనున్నాయి.

By Medi Samrat  Published on  22 Dec 2023 1:30 PM GMT
ఏమైంది..? దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి వచ్చేసిన విరాట్ కోహ్లీ..!

ప్రస్తుతం భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. టీ20, వన్డే సిరీస్‌ల తర్వాత ఇరు జట్లు రెండు టెస్టుల సిరీస్‌లో త‌ల‌ప‌డనున్నాయి. అయితే దీనికి ముందు భారత్ జ‌ట్టులో అనూహ్య ప‌రిణామం చోటుచేపుకుంది. మీడియా నివేదికల ప్రకారం.. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ రెండు టెస్ట్ మ్యాచ్‌లకు దూరంగా ఉండ‌నున్న‌ట్లు తెలుస్ఉతంది. అదే సమయంలో విరాట్ కోహ్లీ సౌతాఫ్రికా నుంచి అకస్మాత్తుగా ముంబైకి తిరిగొచ్చాడు.

ప్రస్తుతం ప్రిటోరియా వేదికగా జరుగుతున్న మూడు రోజుల ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో విరాట్ పాల్గొనడం లేదు. ఒకవేళ కోహ్‌లీ సిరీస్ ప్రారంభం వ‌ర‌కూ పునరాగమనం చేయకుంటే అది టీమిండియాకు పెద్ద దెబ్బే. అయితే దీనిపై బీసీసీఐ ఎలాంటి అధికారిక ధృవీకరణ ఇవ్వలేదు. డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు జరగనుంది.

మూడు రోజుల క్రితమే టీమ్ మేనేజ్‌మెంట్, బీసీసీఐ నుంచి అనుమతి తీసుకున్న కోహ్లీ ప్రిటోరియాలో జరుగుతున్న‌ మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో పాల్గొనడంలేదు. ఫ్యామిలీ ఎమర్జెన్సీ దీనికి కారణమని చెబుతున్నారు. డిసెంబర్ 26న సెంచూరియన్‌లో ప్రారంభమయ్యే తొలి టెస్టు కోసం అతను జోహన్నెస్‌బర్గ్‌కు తిరిగి వస్తాడని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.

వేలి గాయం నుంచి యువ ఓపెనర్ రుతురాజ్ కోలుకోలేకపోయాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 19న పోర్ట్ ఎలిజబెత్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో ODIలో గైక్వాడ్ వేలికి గాయమైంది. రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డానని.. దాని నుంచి పూర్తిగా కోలుకోలేకపోయానని చెప్పాడు. రుతురాజ్ మూడో వన్డేలో కూడా ఆడలేదని.. అతను వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని బీసీసీఐ తెలిపింది. ఇప్పుడు రెండు టెస్టు మ్యాచ్‌ల కంటే ముందు కోలుకునే అవకాశం లేదని తేలింది. శనివారం నాటికి అత‌డు భారత్‌కు చేరుకునే అవకాశం ఉంది.

Next Story