రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ ఫోటోపై కోహ్లీ ట్వీట్.. ఆట గొప్ప‌త‌నం ఇదే

Virat Kohli reacts to viral photo of Federer and Nadal weeping.మ్యాచ్ ముగిసిన అనంత‌రం రోజ‌ర్ ఫెద‌ర‌ర్ భావోద్వేగానికి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Sept 2022 2:59 PM IST
రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ ఫోటోపై కోహ్లీ ట్వీట్.. ఆట గొప్ప‌త‌నం ఇదే

టెన్నిస్ దిగ్గ‌జం, స్విస్ ఆట‌గాడు రోజ‌ర్ ఫెద‌ర‌ర్ ఆట‌కు వీడ్కోలు ప‌లికాడు. టెన్నిస్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన ఫెడెక్స్ త‌న చివ‌రి మ్యాచ్ ఆడేశాడు. శుక్ర‌వారం జరిగిన లేవ‌ర్ క‌ప్ డ‌బుల్స్ మ్యాచ్‌లో త‌న చిర‌కాల ప్ర‌త్య‌ర్థి, ఆత్మీయ స్నేహితుడు ర‌ఫెల్ నాద‌ల్‌తో జ‌త‌క‌ట్టి ఆడాడు. ఈ మ్యాచ్ ముగిసిన అనంత‌రం రోజ‌ర్ ఫెద‌ర‌ర్ భావోద్వేగానికి లోన‌య్యాడు. రోజ‌ర్‌ను చూసి ర‌ఫెల్ కూడా ఎమోష‌న‌ల్ అయ్యాడు. వీరిద్ద‌రూ చాలా సేప‌టి వ‌ర‌కు భావోద్వేగాల‌ను నియంత్రించుకోలేక‌పోయారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

"ఇదే ఆట గొప్ప‌త‌నం. ఇద్ద‌రు ప్ర‌త్య‌ర్థులు ఒక‌రి ప‌ట్ల మ‌రొక‌రు ఇలా ఉంటార‌ని ఎవ‌రూ అనుకుంటారు. నేను చూసిన అత్యంత అంద‌మైన క్రీడా ఫోటో ఇదే. నీ కోసం నీ ప్రత్యర్థి కన్నీళ్లు పెట్టుకుంటే, అంతకంటే గొప్ప విషయం ఇంకేముంటుంది. దేవుడిచ్చిన టాలెంట్‌తో నువ్వేం చేయగలవో ప్రత్యేకంగా చెప్పాలా.. వీళ్లిద్దరిపైన గౌరవం మరింత పెరిగింది." అంటూ రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్‌‌ ఎమోషనల్ అయిన ఫోటోను విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు.

Next Story