రెస్ట్ కావాలని అడ‌గ‌లేదు : కోహ్లీ షాకింగ్ కామెంట్స్‌

Virat Kohli Press Conference Highlights. గత కొద్దిరోజులుగా భారత క్రికెట్ గురించి తీవ్ర చర్చ జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా విరాట్ కోహ్

By Medi Samrat  Published on  15 Dec 2021 9:28 AM GMT
రెస్ట్ కావాలని అడ‌గ‌లేదు : కోహ్లీ షాకింగ్ కామెంట్స్‌

గత కొద్దిరోజులుగా భారత క్రికెట్ గురించి తీవ్ర చర్చ జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల చుట్టూ ఎన్నో రూమర్స్ వస్తూ ఉన్నాయి. కోహ్లీని గత వారం వన్డే కెప్టెన్సీ నుంచి సడన్‌గా తప్పించిన భారత సెలెక్టర్లు.. రోహిత్ శర్మకి వన్డే టీమ్ పగ్గాలు అప్పగించిన తర్వాత చాలా వార్తలు వచ్చాయి. ఇక దక్షిణాఫ్రికాతో సిరీస్ కు ముందు కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. దక్షిణాఫ్రికా సిరీస్ లో మేము సెంటర్ వికెట్ ప్రాక్టీస్, మ్యాచ్ సిమ్యులేషన్ పొందడానికి చూస్తామని.. మ్యాచ్ పరిస్థితులను అంచనా వేయడానికి వీలున్నంత వరకు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నిస్తామని కోహ్లీ తెలిపాడు. టెస్టులకు ఎంపికయ్యే గంటన్నర ముందు నన్ను సంప్రదించారని కోహ్లీ తెలిపాడు. నేను ఎంపిక కోసం అందుబాటులో ఉన్నాను. నేను విరామం కావాల‌ని బీసీసీఐకి చెప్పలేదు. దక్షిణాఫ్రికాలో వన్డేలకు ఎంపిక చేసేందుకు నేను అందుబాటులో ఉన్నానని తేల్చి చెప్పాడు కోహ్లీ.

నేను T20I కెప్టెన్సీని వదులుకోవాలనుకుంటున్నాను అని BCCIకి చెప్పినప్పుడు, వారు అంగీకరించారు. వన్డేలు, టెస్టుల్లో సారథ్యం వహించాలనుకుంటున్నట్లు ఆ సమయంలో తెలియజేశాను. నా వైపు నుండి కమ్యూనికేషన్ స్పష్టంగా ఉందని నేను తెలియజేసాను. జట్టును సరైన దిశలో నడిపించడం నా బాధ్యత. రోహిత్ చాలా సమర్థుడైన కెప్టెన్ మరియు వ్యూహాత్మకంగా చాలా మంచివాడు. రాహుల్ ద్రావిడ్ కూడా గొప్ప వ్యక్తి. వన్డేలు, టీ20ల్లో వారికి నా 100 శాతం మద్దతు లభిస్తుంది. నాకు, రోహిత్ శర్మకు మధ్య ఎలాంటి సమస్య లేదు. నేను గత రెండు సంవత్సరాలుగా స్పష్టం చేస్తున్నాను మరియు నేను అలసిపోయాను.

ముంబయి నుంచి గురువారం దక్షిణాఫ్రికా‌కి భారత టెస్టు జట్టు బయల్దేరనుండగా.. విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. ఈ క్రమంలో మీరు వన్డే సిరీస్‌కి దూరంగా ఉంటున్నారా? రెస్ట్ కావాలని బీసీసీఐని రిక్వెస్ట్ చేశారట? అని ప్రశ్నించగా.. లేదని సమాధానం చెప్పాడు కోహ్లీ. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కి జట్టు సెలక్షన్‌కి నేను అందుబాటులో ఉంటాను. రెస్ట్ గురించి నేను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో చర్చించలేదు. ఈ ప్రశ్న నన్ను కాదు.. ఈ రూమర్ గురించి ఎవరు రాశారో? వారినే అడగండి. నేను మాత్రం బీసీసీఐతో రెస్ట్ గురించి మాట్లాడలేదని కోహ్లీ స్పష్టం చేశాడు.


Next Story
Share it