'భ‌య్యా ఇది ఆశ్ర‌మం'.. వీడియో తీస్తున్న వారితో కోహ్లీ..

Virat Kohli Politely Requests Fans To Not Film Video. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో విరాట్ కోహ్లీ భాగం కాడనే సంగతి తెలిసిందే.

By M.S.R  Published on  31 Jan 2023 4:01 PM IST
భ‌య్యా ఇది ఆశ్ర‌మం.. వీడియో తీస్తున్న వారితో కోహ్లీ..

న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో విరాట్ కోహ్లీ భాగం కాడనే సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 09న ప్రారంభం కానున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లి అద్భుతంగా ఆడాలని, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు భారత్ ను చేరవేయాలని అభిమానులు ఆశిస్తూ ఉన్నారు. ఇక విరాట్ ప్రస్తుతం తన భార్య అనుష్క శర్మతో కలిసి పలు ప్రాంతాలను సందర్శిస్తూ ఉన్నాడు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కు ప్రాక్టీస్ సెషన్‌లు ప్రారంభమవ్వడానికి ముందు, విరాట్ తన భార్య అనుష్కతో కలిసి ఉత్తరాఖండ్‌లోని ఆధ్యాత్మిక ప్రదేశంలో కనిపించాడు. ఈ జంటకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. రిషికేశ్‌లోని స్వామి దయానంద్ ఆశ్రమంలో స్వామి దయానంద్ జీ మహారాజ్ సమాధిని ఈ జంట సందర్శించింది. కోహ్లీకి ఉన్న పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని, అభిమానులు చుట్టుముట్టారు. కొన్ని వస్తువులపై సంతకం చేయమని అడిగారు. ఇక వీడియోలు తీస్తున్న వారిని విరాట్ కోహ్లీ సముదాయించాడు. ఇది ఆశ్రమం కాస్త జాగ్రత్తగా ఉండండి అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు.



Next Story