సరికొత్త లుక్‌లో ఐపీఎల్‌కు రెడీ అవుతోన్న విరాట్‌ కోహ్లీ

ఈసారి కొత్త లుక్‌లో విరాట్‌ కోహ్లీ వస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  19 March 2024 12:41 PM IST
virat kohli, new look, ipl-2024, cricket,

 సరికొత్త లుక్‌లో ఐపీఎల్‌కు రెడీ అవుతోన్న విరాట్‌ కోహ్లీ

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్‌ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా హీరోలకు సమానమైన క్రేజ్‌తో విరాట్‌కు కూడా సమానంగా ఉంటుంది. అయితే.. విరాట్‌ కోహ్లీ గత కొద్ది నెలలుగా వ్యక్తిగత కారణాలతో క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అయితే.. ఐపీఎల్‌కు తాజాగా అతడు సిద్ధం అయ్యాడు. ఈసారి కొత్త లుక్‌లో విరాట్‌ కోహ్లీ వస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఐపీఎల్ 2024 సీజన్‌ మ్యాచ్‌లు మార్చి 22న నుంచి ప్రారంభం కాబోతున్నాయి. తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ టీమ్‌ తలపడబోతుంది. ఈ నేపథ్యంలోనే మార్చి 17న ఇండియాకు వచ్చాడు కింగ్ కోహ్లీ. ఆర్‌సీబీ క్యాంపులో చేరాడు.. ప్రాక్టీస్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఐపీఎల్‌-2024 సీజన్‌ కోసం తన లుక్‌ని మార్చేశాడు విరాట్. సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. సెలబ్రిటీ హెయిర్‌ స్టైయిలిస్ట్‌ ఆలీం హకీం, విరాట్‌ కోహ్లీ న్యూ లుక్‌ని సోషల్‌ మీడియాలో షేర్ చేశాడు. హెయిర్ స్టైయిల్‌ మార్చడం విరాట్‌ కోహ్లీ తరచూ చేస్తుంటాడు. అయితే.. ఈసారి కనుబొమ్మలకి ఒక కాటు పెట్టించుకున్నాడు. సినిమా హీరోలకు పోటీ ఇచ్చేలా కనిపిస్తున్నాడు విరాట్‌.

విరాట్‌ స్టైల్‌ను చూసిన అభిమానులు తెగ పొగిడేస్తున్నారు. ఆయన ఫొటోలను షేర్‌ చేస్తూ.. లైక్స్ కొడుతున్నారు. పది మంది షారుక్‌ఖాన్‌లు, వంది మంది రణ్‌బీర్‌ కపూర్‌లు కలిస్తే ఒక కింగ్‌ కోహ్లీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. క్రికెట్‌కు రిటైర్మెంట్ తర్వాత విరాట్‌.. తన భార్య అనుష్కతో కలిసి సినిమా చేయాలంటూ పలువురు అభిమానులు ఈ సందర్భంగా కోరుతున్నారు.

Next Story