రూ.1000 కోట్లు దాటిన కింగ్ 'కోహ్లీ' ఆస్తులు
Virat Kohli Net Worth Crosses 1000 Crores. భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ నికర ఆస్తుల విలువ రూ.1000 కోట్లు దాటింది.
By Medi Samrat Published on 18 Jun 2023 4:40 PM ISTభారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ నికర ఆస్తుల విలువ రూ.1000 కోట్లు దాటింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 252 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్న కోహ్లీ నికర విలువకు సంబంధించి స్టాక్ గ్రో ఈ విషయాన్ని వెల్లడించింది. విరాట్ కోహ్లీ నికర విలువ రూ. 1050 కోట్లకు చేరుకుంది. ప్రపంచంలోని క్రికెట్ ఆటగాళ్లందరిలో ఇదే అత్యధికం.
34 ఏళ్ల విరాట్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) 'ఏ+' కేటగిరీలో ఉంచింది. కాంట్రాక్టు కింద ఏటా ఏడు కోట్ల రూపాయలు పొందుతున్నాడు. దీంతో పాటు టెస్టు ఆడినందుకు రూ.15 లక్షలు, వన్డేకు రూ.6 లక్షలు, టీ20 మ్యాచ్ ఆడేందుకు రూ.3 లక్షలు బీసీసీఐ ఇస్తుంది.
భారత జట్టుతో పాటు, ఐపీఎల్‌లో కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తరఫున ఆడుతున్నాడు. ఆర్సీబీ విరాట్ కోహ్లీకి ఒక సీజన్‌కు 15 కోట్లు ఇస్తుంది. స్పోర్ట్స్‌తో పాటు, కోహ్లీకి అనేక బ్రాండ్లకు అంభాసిడర్‌గా ఉన్నాడు. అలాగే ఏడు స్టార్టప్‌లలో పెట్టుబడులు కూడా పెట్టాడు.
కోహ్లీ 18 బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా ఉన్నాడు. ప్రతి యాడ్ షూట్‌కి విరాట్ ఏడాదికి రూ.7.50 నుంచి 10 కోట్లు వసూలు చేస్తున్నాడు. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా కోహ్లీ దాదాపు రూ. 175 కోట్లు సంపాదిస్తున్నాడు. కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ కోసం 8.9 కోట్లు వసూలు చేస్తాడు. ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌కు రూ.2.5 కోట్లు వసూలు చేస్తాడు. ఇక విరాట్‌కి రెండు ఇళ్లు ఉన్నాయి. ముంబైలోని ఇంటి ఖరీదు రూ.34 కోట్లు కాగా, గురుగ్రామ్‌లోని ఇంటి ధర రూ.80 కోట్లు. కార్లంటే కోహ్లీకి మక్కువ. విరాట్ రూ.31 కోట్ల విలువైన లగ్జరీ కార్ల యజమాని.