దక్షిణాఫ్రికాతో సిరీస్ గురించి కీలక వ్యాఖ్యలు చేసిన విరాట్ కోహ్లీ

Virat Kohli makes key remarks about the series with South Africa. భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటన సందిగ్ధంలో పడింది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 17 నుంచి జనవరి 26 వరకు టీమిండియా దక్షిణాఫ్రికాలో పర్యటించాలి.

By M.S.R  Published on  2 Dec 2021 2:24 PM GMT
దక్షిణాఫ్రికాతో సిరీస్ గురించి కీలక వ్యాఖ్యలు చేసిన విరాట్ కోహ్లీ

కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్' దెబ్బకు దక్షిణాఫ్రికాలో పెద్ద ఎత్తున పాజిటివ్ గా కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. మంగళవారం 4,373గా నమోదైన కరోనా కేసులు బుధవారం నాటికి ఏకంగా 8,561కి చేరుకున్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఒమిక్రాన్ కేసులు దేశంలో వేగంగా పెరుగుతున్నట్టు సౌతాఫ్రికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ కేసుల సంఖ్య రెండింతలు, మూడింతలకు పెరగడాన్ని మనం చూస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ప్రాంతీయ వైరాలజిస్ట్ డాక్టర్ నిక్సీ గుమెడె-మోలెట్సీ హెచ్చరించారు.

దీంతో దక్షిణాఫ్రికాకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. అంతేకాకుండా అక్కడి నుండి వచ్చిన వాళ్లకు ఎక్కడ కరోనా పాజిటివ్ అని తేలుతుందోననే భయం ఇతరుల్లో మొదలైంది. దీంతో భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటన సందిగ్ధంలో పడింది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 17 నుంచి జనవరి 26 వరకు టీమిండియా దక్షిణాఫ్రికాలో పర్యటించాలి. ఈ టూర్ లో 3 టెస్టులు, 3 వన్డేలు, 4 టీ20లు ఆడాలి. ఒమిక్రాన్ వేరియంట్ మరింత విజృంభిస్తే ఈ టూర్ ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితులపై కోహ్లీ మాట్లాడుతూ, దక్షిణాఫ్రికా పర్యటనకు సంబంధించి బీసీసీఐతో టచ్ లో ఉన్నామని చెప్పారు. టూర్ పై త్వరలోనే తమకు క్లారిటీ వస్తుందని తెలిపారు. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తో కూడా ఈ అంశంపై చర్చలు జరుపుతున్నామని తెలిపారు.

ఇక రెండు దేశాల బోర్డులు నిరంతరం టచ్‌లో ఉన్నాయని, ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ అధికారి ఒకరు గురువారం ANIకి ధృవీకరించారు. "ఓమిక్రాన్ వేరియంట్ ముప్పు కారణంగా సిరీస్‌ను ఒక వారం వెనక్కి నెట్టాలని మేము చర్చిస్తున్నాము. మేము భారత ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాము, రెండు బోర్డులు నిరంతరం టచ్‌లో ఉన్నాయి మరియు ప్రతిదీ చర్చించబడుతోంది. మా ఆటగాళ్ల ఆరోగ్యం మరియు భద్రత చాలా ముఖ్యమైనది "అని సీనియర్ అధికారి ANI కి చెప్పారు.

అంతకుముందు, కొత్త COVID-19 వేరియంట్ ఉద్భవించిన దక్షిణాఫ్రికాకు క్రికెట్ జట్టును పంపే ముందు ప్రభుత్వాన్ని సంప్రదించాలని కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు.

Next Story
Share it