ఐపీఎల్‌పై కింగ్‌ విరాట్‌ కోహ్లీ ఆసక్తికర కామెంట్స్

ఐపీఎల్‌ సీజన్‌-2024 మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కానుంది.

By Srikanth Gundamalla  Published on  9 March 2024 9:00 AM GMT
virat kohli, interesting comments,  ipl, cricket,

 ఐపీఎల్‌పై కింగ్‌ విరాట్‌ కోహ్లీ ఆసక్తికర కామెంట్స్ 

ఐపీఎల్‌ సీజన్‌-2024 మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో క్రికెట్‌ అభిమానులంతా ఈ సీజన్‌ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఐపీఎల్‌ సీజన్‌-2024 తొలి షెడ్యూల్‌ వచ్చేసింది. మొదటి మ్యాచ్‌ చెన్నై సూపర్‌ కింగ్స్, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరగనుంది. అధికంగా ఫ్యాన్‌ బేస్‌ ఉన్న ఈ రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్‌ ఉండటంతో అందర్లోనూ ఆసక్తిని పెంచుతోంది. అయితే.. ఐపీఎల్‌ గురించి తాజాగా స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

తననకు ఐపీఎల్‌ అంటే చాలా ఇష్టమని విరాట్‌ కోహ్లీ అన్నాడు. ఐపీఎల్‌లో ఆటగాళ్లు దేశాలతో సంబంధం లేకుండా సోదరా భావంతో మెలుగుతారని చెప్పాడు. అంతేకాదు.. జాతీయ జట్టుకు ఆడుతున్న సమయంలో ఉన్న ప్రత్యర్థి జట్టులోని వారు మనకు తెలిసినవారే ఉంటారు. ఇప్పుడు వారు కూడా కలిసి ఆడటం ఎంతో బాగుంటుందని విరాట్‌ కోహ్లీ అన్నాడు. తాను మాత్రమే కాదు.. తనలా ఐపీఎల్‌ను ఇష్టపడే ప్లేయర్లు చాలా మందే ఉంటారని వ్యాఖ్యానించాడు. అందుకు ఒకే ఒక్క కారణం దేశాలతో సంబంధం లేకుండా అందరు ప్లేయర్లు కలిసి ఆడటమే అన్నాడు. మరోవైపు ఆయా టీములకు అభిమానులు ఇచ్చే ప్రేమ కూడా ప్రత్యేకంగా ఉంటాయని విరాట్‌ కోహ్లీ అన్నాడు.

క్యాచ్‌ రిల్‌ లీగ్‌ ఆరంభం నుంచి కోహ్లీ ఆర్‌సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఆర్సీబీ అంటే కోహ్లీ.. కోహ్లీ అంటే ఆర్సీబీ అన్నట్లుగా ఉంటుంది. 2013 నుంచి కెప్టెన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే.. 2021 ఐపీఎల్ సీజన్‌ తర్వాత కెప్టెన్‌ నుంచి తప్పుకున్నాడు. కానీ ఆ టీమ్‌లో ఆటగాడిగా మాత్రం కొనసాగుతూనే ఉన్నాడు. అయితే.. కొంతకాలంగా టీమిండియాకు కూడా విరాట్‌ దూరంగా ఉన్నాడు. అతని భార్య అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మనివ్వడమే ఇందుకు కారణంగా. లండన్‌లో అనుష్కతో పాటే ఉన్నాడు కోహ్లీ. అయితే.. మగబిడ్డకు జన్మనిచ్చిన నేపథ్యంలో బాబు పేరును కూడా అకాయ్‌గా పెట్టినట్లు చెప్పాడు. ప్రస్తుతం టీమిండియాకు కూడా దూరంగా ఉన్న విరాట్‌.. ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభ సమయానికి వస్తాడా లేదా? అన్నది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో స్టార్‌ స్పోర్ట్స్‌ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశాడు విరాట్‌ కోహ్లీ.


Next Story