ఐపీఎల్‌లో ఈ సారి విరాట్‌ కోహ్లీ ఆడతాడా? లేదా?

భారత్‌లో క్రికెట్‌కు మంచి ఆదరణ ఉంటుంది. టీమిండియా క్రికెట్‌ మ్యాచ్‌లు ఎక్కడున్నా సరే అభిమానులు మ్యాచ్‌లకు వెళ్తుంటారు.

By Srikanth Gundamalla  Published on  27 Feb 2024 11:30 AM IST
cricket, virat kohli, london, ipl-2024,

ఐపీఎల్‌లో ఈ సారి విరాట్‌ కోహ్లీ ఆడతాడా? లేదా? 

భారత్‌లో క్రికెట్‌కు మంచి ఆదరణ ఉంటుంది. టీమిండియా క్రికెట్‌ మ్యాచ్‌లు ఎక్కడున్నా సరే అభిమానులు మ్యాచ్‌లకు తరలివెళ్తుంటారు. ఇక ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌కు ఉండే క్రేజ్ వేరు. ఒక్కో టీమ్‌కు సపరేట్‌ ఫ్యాన్‌ బేస్ ఉంటుంది. అయితే.. 2024 ఐపీఎల్ సీజన్‌ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఈ సీజన్‌లో కొన్ని మార్పులు కూడా జరిగిపోయాయి. ఇక టీమిండియా స్టార్‌ ప్లేయర్ విరాట్‌ కోహ్లీ ఆడుతోన్న బెంగళూరు టీమ్‌ కప్‌ కొట్టాలని ఎంతో మంది అభిమానులు కోరుకుంటున్నారు.

కాగా.. విరాట్‌ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో కొంతకాలంగా టీమిండియాకు దూరంగా ఉన్నాడు. ఇంగ్లండ్‌తో టెస్టులతో పాటు ఇంకొన్ని మ్యాచ్‌లు కూడా అతను ఆడలేదు. దాంతో.. విరాట్‌ ఈసారి ఐపీఎల్‌ మ్యాచుల్లో ఆడతాడా లేదా అనే ప్రశ్న మొదలయ్యింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ లండన్‌లో ఉన్నాడు. తన భార్య అనుష్క రెండోసారి బిడ్డకు జన్మనిచ్చింది. మగబిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు విరాట్, అనుష్క. అయితే.. భార్య డెలివరీ కావడంతో విరాట్‌ కూడా లండన్‌లోనే ఉండిపోయాడు.

విరాట్‌ కోహ్లీ లండన్ నుంచి భారత్‌కు ఎప్పుడు తిరిగి వస్తాడు? ఐపీఎల్‌లో ఆడతాడా లేదా అన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఐపీఎల్ షెడ్యూల్ కూడా విడుదలైంది. ఆర్‌సీబీ మార్చి 22న తమ తొలి మ్యాచ్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఆడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ భారత్‌కు రావడంపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో కోహ్లీ ఐపీఎల్‌ మ్యాచుల్లో కనిపిస్తాడా ? లేదా అనే ప్రశ్నలు కొనసాగుతున్నాయి. ఇక కోహ్లీ ఐపీఎల్‌ ఆడే అంశంపై టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్‌ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

వ్యక్తిగత కారణాలతోనే కోహ్లీ టీమిండియాకు దూరంగా ఉన్నాడని చెప్పారు సునీల్ గవాస్కర్. అలాంటి ఐపీఎల్‌లో ఆడుతాడా? తనకు తెలిసినంత వరకు విరాట్‌ ఐపీఎల్‌లో కూడా ఆడకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశాడు సునీల్ గవాస్కర్. మరోవైపు టీమిండియా ఇంగ్లండ్‌పై టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకోవడంపై విరాట్‌ సంతోషం వ్యక్తం చేశాడు.

Next Story