ఐపీఎల్ ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ మరో రికార్డ్
IPL 2024 41వ మ్యాచ్ గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగింది.
By Medi Samrat
IPL 2024 41వ మ్యాచ్ గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ SRH విజయాల కోటను బద్దలు కొట్టింది. విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్ బ్యాటింగ్‌లో పటిష్ట ప్రదర్శన చేశారు. ఇద్దరూ వేగంగా అర్ధ సెంచరీలు సాధించారు. ఈ క్రమంలోనే కింగ్ కోహ్లీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా ఐపీఎల్‌లో 4,000 పరుగులు పూర్తి చేశాడు.
హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. అనంతరం సన్‌రైజర్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేసింది. కింగ్ కోహ్లీ 43 బంతుల్లో 51 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతడి ఇన్నింగ్సులో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. ఈ సీజన్‌లో అతనికిది నాలుగో అర్ధ సెంచరీ. పాటిదార్ 20 బంతులు మాత్రమే ఎదుర్కొని 50 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సీజన్‌లో అతని బ్యాట్‌తో ఇది మూడో అర్ధ సెంచరీ.
ఆర్సీబీ ఓపెనర్‌గా కింగ్ కోహ్లీ భారీ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో ఓపెనర్‌గా 4,000 పరుగులు పూర్తి చేశాడు. 35 ఏళ్ల కోహ్లీ ఐపీఎల్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా 4,041 పరుగులు చేశాడు. దీంతో శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్‌ల సరసన చేరాడు.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ ధవన్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు ఇప్పటివరకు ఓపెనర్‌గా 6,362 పరుగులు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ వార్నర్ కూడా ఓపెనర్‌గా 5,909 పరుగులు చేశాడు. వెటరన్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ పేరు 4480 పరుగులు చేసిన మూడవ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో విరాట్ నాలుగో స్థానంలో ఉన్నాడు.