విరాట్‌ కోహ్లి అరుదైన రికార్డు.. టీమ్ఇండియా ఆరో క్రికెట‌ర్‌గా

Virat Kohli becomes sixth Indian batter to score 8000 Test runs.టీమ్ఇండియా మాజీ కెప్టెన్, ప‌రుగుల యంత్రం విరాట్ కోహ్లీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 March 2022 3:45 PM IST
విరాట్‌ కోహ్లి అరుదైన రికార్డు.. టీమ్ఇండియా ఆరో క్రికెట‌ర్‌గా

టీమ్ఇండియా మాజీ కెప్టెన్, ప‌రుగుల యంత్రం విరాట్ కోహ్లీ త‌న వందో టెస్టులో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో 8 వేల ప‌రుగుల‌ను పూర్తి చేసుకున్నాడు. మొహాలీ వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో అత‌డు ఈ ఘ‌నత‌ను అందుకున్నాడు. ఈ ఘ‌న‌త సాధించిన ఆరో భార‌త బ్యాట్స్‌మెన్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. స‌చిన్ టెండూల్క‌ర్‌(15,921), రాహుల్ ద్రావిడ్‌(13,265), సునీల్ గ‌వాస్క‌ర్‌(10,122), వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌(8,781), వీరేంద్ర సెహ్వాగ్(8,503) అత‌డి క‌న్నా ముందు ఉన్నారు. విరాట్ త‌న 169 ఇన్నింగ్స్‌లో ఈ ఘ‌న‌త అందుకోగా.. స‌చిన్ టెండూల్క‌ర్(154 ఇన్నింగ్స్‌లో) తొలి స్థానంలో ఉన్నాడు. కాగా.. ఆస్ట్రేలియా దిగ్గ‌జ ఆట‌గాడు రికీ పాంటింగ్ సైతం త‌న వందో టెస్టులోనే 8వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి 47 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం టీమ్ఇండియా 5 వికెట్ల న‌ష్టానికి 257 ప‌రుగులు చేసింది. వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌(45), ర‌వీంద్ర జ‌డేజా (11) ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

Next Story