రికార్డుల రారాజు ఖాతాలో మరో రికార్డు
Virat Kohli becomes fastest to register 23000 international runs.రికార్డుల రారాజు, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ
By తోట వంశీ కుమార్ Published on 2 Sept 2021 6:43 PM ISTరికార్డుల రారాజు, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతి తక్కువ మ్యాచ్‌ల్లో 23వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. విరాట్ కోహ్లీ కేవలం 490 మ్యాచ్‌ల్లో ఈ ఘనత అందుకుని సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. ఓవల్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో విరాట్ ఈ ఘనత సాధించాడు. తద్వారా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. సచిన్ 552 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఈ ఘనత అందుకున్నాడు. వీరిద్దరి తరువాత రిక్కీ పాంటింగ్ (544), జాక్వెస్ కలిస్ (551), కుమార సంగక్కర (568), రాహుల్ ద్రవిడ్ (576), మహేల జయవర్దనె (645) తరువాతి స్థానాల్లో ఉన్నారు.
23K and counting...@imVkohli | #TeamIndia pic.twitter.com/l0oVhiIYP6
— BCCI (@BCCI) September 2, 2021
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న టీమ్ఇండియాకు ఇంగ్లాండ్ బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఇంగ్లాండ్ పేసర్ల ధాటికి రోహిత్ శర్మ (11), కేఎల్ రాహుల్ (17)తో పాటు చతేశ్వర్ పుజారా (4) తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరారు. దీంతో టీమ్ఇండియా లంచ్ విరామానికి 54/3 తో నిలిచింది. కెప్టెన్ కోహ్లీ(18), రవీంద్ర జడేజా(2) పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా.. పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న రహానే కంటే ముందుగా జడేజా ను ముందుగా క్రీజులోకి రావడం గమనార్హం.