ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2022 టోర్నీలో పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడుతున్నాడు. తొలి మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌పై 82 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చిన విరాట్.. నెదర్లాండ్స్‌తో ఆడిన మ్యాచ్‌లో 62 పరుగులతో అజేయంగా నిలిచాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
నేడు దక్షిణాఫ్రికాతో జరగబోయే మ్యాచ్‌లో విరాట్ 28 పరుగులు సాధిస్తే టీ20 ప్రపంచకప్ మ్యాచుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలువనున్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్థనే పేరిట ఉంది. జయవర్థనే 1016 పరుగులతో తొలి స్థానంలో ఉండగా.. 989 పరుగులతో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
దక్షిణాఫ్రికాపై 11 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేస్తే.. టీ20 ప్రపంచకప్‌లలో జయవర్ధనే తర్వాత 1,000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా కోహ్లీ నిలవనున్నాడు.
33 ఏళ్ల కోహ్లీ ఇప్పటివరకు 23 టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడాడు. 89.9 సగటుతో 989 పరుగులు చేశాడు. ఇందులో 12 అర్థశతకాలు ఉన్నాయి.