మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2024 టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ ట్రోఫీ కరువు తీరినట్టైంది. 16 సీజన్లు పూర్తైనా పురుషుల జట్టు ఇంకా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టైటిల్‌ను గెలవలేదు. కానీ RCB మహిళల జట్టు WPL రెండవ సీజన్‌లోనే టైటిల్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో స్మృతి మంధాన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. దీనిపై ఫ్రాంచైజీ పురుషుల జట్టు మాజీ యజమాని విజయ్ మాల్యా సోషల్ మీడియా ద్వారా జట్టును అభినందించాడు.
విజయ్ మాల్యా ట్విట్టర్ లో.. 'WPL గెలిచినందుకు RCB మహిళల జట్టుకు హృదయపూర్వక అభినందనలు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఐపీఎల్‌లో RCB పురుషుల జట్టు గెలిస్తే అది అద్భుతమైన డబుల్ అవుతుంది. గుడ్ లక్ అని అడ్వాన్స్ అభినందనలు తెలియజేశారు.
గత ఏడాది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో విఫలమైన తర్వాత టీమ్ మేనేజ్‌మెంట్ నుండి తమకు గట్టి మద్దతు లభించిందని ఆర్‌సిబి మహిళల జట్టు కెప్టెన్ స్మృతి మంధాన ఫైనల్ తర్వాత చెప్పారు. దీంతో ఆదివారం జరిగిన టైటిల్‌ను జట్టు గెలుచుకుంది. 2023 WPL మాకు ఎన్నో విషయాలను నేర్పిందని అన్నారు. WPL టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా.. RCB మహిళల గ్రూప్ 16 ఏళ్లలో తమ పురుషుల జట్టు చేయలేనిది సాధించింది. అయితే తనకు ఎప్పుడూ మద్దతుగా నిలిచిన అభిమానులకు మంధాన ధన్యవాదాలు తెలిపింది.