విజయ్ కోసం కథ రాసిన మిస్టరీ స్పిన్నర్
మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన స్పిన్ బౌలింగ్‌తో ఎంతో పేరు సంపాదించాడు.
By Medi Samrat Published on 23 July 2024 2:15 PM ISTమిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన స్పిన్ బౌలింగ్‌తో ఎంతో పేరు సంపాదించాడు. 2018లో దేశవాళీ క్రికెట్‌లో తన కెరీర్‌ను ప్రారంభించిన వరుణ్.. తి తక్కువ టైంలోనే T20 క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు. IPLలో కోల్‌కతా నైట్ రైడర్స్ కు ఆడుతూ వరుణ్ చక్రవర్తి చాలా పేరు సంపాదించాడు. 2019 IPL సీజన్‌లో చాలా మ్యాచ్‌లలో రాణించాడు. ఆ తర్వాత 12 అక్టోబర్ 2021లో భారత్ తరుపున అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడాడు. అయితే ఆ తర్వాత అతడు భారత జట్టులోకి తిరిగి రాలేకపోయాడు.
ఇదిలా ఉంటే.. క్రికెట్‌తో పాటు సినిమా మేకింగ్‌పై వరుణ్‌కు ఆసక్తి. ఇటీవల ఆర్ అశ్విన్ యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. తమిళ సూపర్ స్టార్ విజయ్ కోసం తాను సినిమా కథను సిద్ధం చేసినట్లు చెప్పాడు. అయితే.. ఈ ఏడాదే నటనకు రిటైర్మెంట్ చెప్తూ రాజకీయాల్లోకి వస్తున్నాని ప్రకటించిన విజయ్ తన కథ తర్వాత సినిమాల్లోకి మళ్లీ వస్తారని వరుణ్ భావిస్తున్నాడు. వరుణ్ మాట్లాడుతూ.. నేను విజయ్ కోసం ఒక కథ రాశాను. ఆయన కోరుకుంటే.. నేను ఆయన రీఎంట్రీ సినిమాకు దర్శకత్వం వహిస్తానన్నాడు.
సినిమా అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. నాకు 25 ఏళ్లు ఉన్నప్పుడు నాకు 4-5 కలలు ఉండేవని.. ఆ వయసులో ప్రతి ఒక్కరికి ఏమి చేయాలో క్లారిటీ ఉంటుందని అన్నాడు. ప్రస్తుతం నేను చేయాలనుకుంటున్న 2-3 లక్ష్యాలు ఉన్నాయి. వాటిలో చిత్రనిర్మాణం మొదటిది. నాకు కథలు రాయడం అంటే చాలా ఇష్టం. 3 కథలు రాశానని తెలిపాడు.
మిస్టరీ స్పిన్నర్ పేరు ఉన్న తనను కూడా ట్రోల్ చేశారని వరుణ్ చక్రవర్తి వీడియోలో తెలిపారు. ఎక్కువ పరుగులు ఇచ్చినప్పుడు అభిమానులు తనను చాలా ట్రోల్ చేస్తారని పేర్కొన్నాడు. క్రికెట్ ఫీల్డ్‌లో రాణించకపోతే.. ఎగతాళి చేస్తారు.. మళ్లీ నిర్మాణ రంగం(వరుణ్ ఒక అర్కిటెక్చర్) లోకి వెళ్లమని సలహా ఇస్తారని పేర్కొన్నాడు.