అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మరో స్టార్ క్రికెటర్
Upul Tharanga announces retirement from international cricket.అంతర్జాతీయ క్రికెట్‌కు మరో ఆటగాడు గుడ్‌బై చెప్పాడు.
By తోట వంశీ కుమార్ Published on 23 Feb 2021 1:38 PM GMTఅంతర్జాతీయ క్రికెట్‌కు మరో ఆటగాడు గుడ్‌బై చెప్పాడు. శ్రీలంక సీనియర్ ఆటగాడు, వికెట్ కీపర్ ఉపుల్ తరంగ సోషల్ మీడియా వేదికగా తాను క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ అవుతున్నట్లు వెల్లడించాడు. 2005లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఉపుల్ తరంగ.. తన 16 ఏళ్ల కెరీర్‌లో 235 వన్డేల్లో 15 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీల సాయంతో 6951 పరుగులు, 31 టెస్టుల్లో 3 శతకాలు, 8 అర్థ శతకాలు బాది 1754 పరుగులు చేశాడు. 2006లో ఇంగ్లాండ్ టూర్‌లో 5-0తేడాతో గెలవడంలో తరంగ కీలక పాత్ర పోషించాడు. సనత్ జయసూర్యతో కలిసి ఓపెనింగ్‌లో మంచి భాగస్వామ్యాలు నమోదు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 2019లో దక్షిణాఫ్రికా పర్యటనలో తన చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. 2007,2011 ప్రపంచకప్‌లలో తరంగ శ్రీలంక జట్టు సభ్యుడిగా ఉన్నాడు.
I have decided to retire from international cricket 🏏 pic.twitter.com/xTocDusW8A
— Upul Tharanga (@upultharanga44) February 23, 2021
'నేటితో అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలకాలనుకుంటున్నా. కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. 16 ఏళ్ల పాటు లంక్ క్రికెట్‌కు సేవలందించడం గొప్ప అనుభూతి. ఈ 16 ఏళ్లలో జట్టుతో ఎన్నో జ్ఞాపకాలతో పాటు మంచి స్నేహితులు ఎందరో దొరికారు. విఫలమైన ప్రతీసారి నాపై ఉన్న నమ్మకంతో అవకాశాలు ఇచ్చిన లంక్ క్రికెట్ బోర్డుకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఇన్నేళ్ల పాటు నాకు మద్దతునిచ్చిన అభిమానులకు.. కష్టకాలంలో నాకు తోడుగా ఉన్న కుటుంబసభ్యులకు ఎంతో రుణపడి ఉన్నా.మీరిచ్చిన ఆశీర్వాదంతోనే ఇంతకాలం క్రికెట్‌ను ఆడగలిగా.. థ్యాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్ ' అంటూ తరంగ ట్వీట్ చేశాడు.