U19 World Cup: తెలుగులో మాట్లాడుకున్న క్రికెటర్లు..వైరల్ వీడియో

అండర్‌ 19 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆదివారం జరిగిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla
Published on : 12 Feb 2024 5:52 PM IST

under-19 world cup, cricket, players,  telugu, viral video,

U19 World Cup: తెలుగులో మాట్లాడుకున్న క్రికెటర్లు..వైరల్ వీడియో

అండర్‌ 19 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆదివారం జరిగిన విషయం తెలిసిందే. ఫైనల్‌లో జూనియర్ ఇండియా జట్టు ఆస్ట్రేలియాతో తలపడింది. అయితే.. ఫైనల్‌ మ్యాచ్‌లో రాణించలేకపోయింది. ఘోర పరాజయం పాలైంది. దాంతో.. అండర్‌ 19 వరల్డ్‌ కప్‌ విజేతగా ఆస్ట్రేలియా జట్టు నిలిచింది. కాగా..ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన జరిగింది. ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు తెలుగులో మాట్లాడుకున్నారు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అండర్ 19 టీమిండియా వికెట్ కీపర్‌ అవనీశ్‌ రావు, బౌలర్ మురుగన్ అభిషేక్ మధ్య తెలుగులో సంభాషణ జరిగింది. అయితే.. ఈ ఇద్దరు క్రికెటర్లు హైదరాబాద్‌కు చెందినవారు. కాగా.. అభిషేక్ బౌలింగ్ చేస్తున్న సమయంలో వికెట్ల వెనకాల ఉన్న కీపర్ అవనీశ్‌ రావు.. బౌలర్ మురుగన్‌తో తెలుగులో మాట్లాడాడు. ఈ వీడియోను స్టార్ స్పోర్ట్స్‌ తెలుగు తన చానెల్‌లో సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసింది. వీడియోలో బౌలర్‌కు వికెట్‌ కీపర్‌ ఎలా బౌలింగ్‌ చేయాలో సలహాలు ఇస్తున్నాడు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగు క్రికెట్ అభిమానులంతా ఈ వీడియో చూసి సంబరపడిపోతున్నారు. ఎప్పుడూ ఇంగ్లీష్‌ లేదా హిందీలో మాట్లాడే ప్లేయర్లు ఉండటం.. కానీ.. ఇద్దరు క్రికెటర్లు గ్రౌండ్‌లోనే తెలుగులో మాట్లాడం వినేందుకు హాయిగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు వరల్డ్‌ కప్‌లో విఫలమై అండర్‌ 19 టీమిండియా జట్టు ఓడిపోవడం బాధగా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు.


Next Story