అంపైర్‌కు ఐసీసీ షాక్.. విధుల నుంచి తొలగించింది.. ఎందుకంటే..?
Umpire Michael Gough Banned For Six Days.కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం ఆటలు అన్ని బయోబబుల్ బుడగలో
By తోట వంశీ కుమార్ Published on 2 Nov 2021 9:03 AMకరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం ఆటలు అన్ని బయోబబుల్ బుడగలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ బయో బబుల్ లో ఉన్న అందరూ ఖచ్చితంగా నియమనిబంధనలు పాటించాల్సిందే. ఒక్కరు తప్పు చేసిన భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021నే ఉదాహారణ. బయోబబుల్ నిబంధనలను కొందరు అతిక్రమించడంతో.. కొద్ది మంది ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. దీంతో లీగ్‌ను ఏప్రిల్‌లో అర్థాంతరంగా రద్దు చేశారు. ఎట్టకేలకు అన్ని అవాంతరాలు దాటుకుని యూఏఈలో మిగతా మ్యాచ్‌లను నిర్వహించారు. రద్దు కారణంగా బీసీసీఐకి భారీగానే నష్టం వాల్లిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ కూడా బయోబబుల్ బుడగలోనే జరుగుతోంది. ఈ మెగా టోర్నీని విజయవంతం చేసేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ బయోబబుల్‌లో ఉన్న ఓ అంపైర్ నిబంధనలు ఉల్లగించడంతో ఐసీసీ సీరియస్ అయ్యింది. ఆరు రోజుల పాటు అతడిని అంపైరింగ్ విధుల నుంచి తప్పింది. ఈ ఆరు రోజులు కఠిన క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించింది. ఆ తరువాత కరోనా పరీక్షల్లో నెటిగివ్‌గా వస్తేనే బయోబబుల్‌లోకి రానిచ్చే అవకాశం ఉంది.
ఇంతకు అంపైర్ ఎవరో కాదు ఇంగ్లాండ్‌కు చెందిన మైకెల్ గాఫ్. అక్టోబర్ 29న మైకెల్ గాఫ్ బయోబబుల్ దాటి బయటికి వెళ్లి కొంతమందిని కలిసాడు. బయోబబుల్‌లోని వ్యక్తులను కాకుండా బయటి వ్యక్తులను కలవడంతో ఐసీసీ గాఫ్ ను అంపైరింగ్ విధుల నుంచి తప్పించింది. వెంటనే అతడిని ఆరు రోజుల పాటు కఠిన క్వారంటైన్ కు తరలించింది. నిజానికి గాప్ అక్టోబర్ 31 జరిగిన భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌కు అంపైరింగ్ చేయాల్సింది. కానీ అతడు నిబంధనలు ఉల్లంఘించడంతో అతడి స్థానంలో సౌతాఫ్రికా అంపైర్ మరాయిస్ ఎరాస్మస్ అంపైరింగ్ విధులు నిర్వర్తించాడు. ఇదిలా ఉంటే.. క్వారంటైన్ పూర్తి అయిన తరువాత గాఫ్‌కు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. నెగిటివ్ వచ్చిన తరువాత అంపైరింగ్ విధులు కొనసాగించే అవకాశం ఉందో లేదో ఐసీసీ ఇంకా చెప్పలేదు.