టెక్నాలజీ ఉన్నా.. రాహుల్ అవుట్ గురించి పెద్ద దుమారమే..

'Umpire is sleeping,' Twitter fumes after Shaheen Afridi dismisses KL Rahul. ప్రస్తుతం నో బాల్స్ గురించి మ్యాచ్ లలో ఎప్పటికప్పుడు థర్డ్ అంపైర్ చూస్తూ ఉంటాడు

By M.S.R  Published on  25 Oct 2021 4:34 AM GMT
టెక్నాలజీ ఉన్నా.. రాహుల్ అవుట్ గురించి పెద్ద దుమారమే..

ప్రస్తుతం నో బాల్స్ గురించి మ్యాచ్ లలో ఎప్పటికప్పుడు థర్డ్ అంపైర్ చూస్తూ ఉంటాడు. ఫీల్డ్ లో ఉన్న అంపైర్ చూడకపోయినా.. థర్డ్ అంపైర్ మాత్రం చూడాల్సి ఉంటుంది. కొంచెం తేడా వచ్చినా కూడా అభిమానుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి ఉంటుంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లో ఎంత హై టెన్షన్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా..! ఆదివారం మొదలైన ఈ మ్యాచ్ లో భారత్ పాక్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో పాక్ వికెట్ నష్టపోకుండా విజయాన్ని అందుకుంది.

ఈ మ్యాచ్‌పై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అవుట్ కాదంటూ ఫొటోలు, వీడియోలు పోస్టు చేస్తూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో షహీన్ అఫ్రిది వేసిన మూడో ఓవర్ తొలి బంతికి కేఎల్ రాహుల్ బౌల్డయ్యాడు. అది నో బాల్ అని చెబుతూ ఫొటోలు షేర్ చేస్తున్నారు. గీత దాటి బౌలింగ్ వేసినట్టు ఆ ఫొటోలు, వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి రాహుల్ నాటౌట్ అని, షహీన్ వేసిన నోబాల్‌కు అతడు అయినట్టు స్పష్టంగా తెలుస్తోందని నెటిజన్లు మండిపడుతున్నారు. టెక్నాలజీ ఉన్నా కూడా ఇలాంటి విషయాలు ఎందుకు పట్టించుకోవడం లేదో తెలపాలని విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు.


Next Story