ఇంగ్లాండ్ టూర్‌.. కోహ్లీసేన‌కు శుభ‌వార్త‌..!

UK government relaxes quarantine norms for Indian cricketers. వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్ షిప్ పైన‌ల్ ఆడేందుకు టీమ్ఇండియా.. ఇంగ్లాండ్‌కు వెళ్ల‌నుంది. అయితే.. అక్క‌డ క‌ఠిన క్వారంటైన్ నుంచి బ్రిటిష్ ప్ర‌భుత్వం స‌డ‌లింపులు క‌ల్పించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 May 2021 8:15 AM GMT
Team India

టీమ్ఇండియాకు నిజంగా ఇది గుడ్‌న్యూసే. క‌రోనా స‌మ‌యంలో ప్ర‌స్తుతం చాలా దేశాల్లో క‌ఠిన క్వారంటైన్ నిబంధ‌న‌లు అమ‌ల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్ షిప్ పైన‌ల్ ఆడేందుకు టీమ్ఇండియా.. ఇంగ్లాండ్‌కు వెళ్ల‌నుంది. అయితే.. అక్క‌డ క‌ఠిన క్వారంటైన్ నుంచి బ్రిటిష్ ప్ర‌భుత్వం స‌డ‌లింపులు క‌ల్పించింది. ప్ర‌యాణ ఆంక్ష‌ల‌ను ర‌ద్దు చేసింది. ఈ మేరకు బీసీసీఐ మంత్రాంగం ఫలించింది. భారత్‌లో ప్రస్తుతం కోవిడ్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై బ్రిటన్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది.

ఇంగ్లాండ్‌ పర్యటన కోసం భార‌త జ‌ట్టు మూడు నెలల పాటు అక్కడే ఉండాలి. ఈ సమయంలో న్యూజిలాండ్‌తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌తోపాటు ఇంగ్లాండ్‌తో ఐదు టెస్ట్‌లు సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ ప్రభుత్వంతో బీసీసీఐ సంప్రదింపులు జరిపి నిబంధనలకు సడలింపులు సాధించింది. కాగా.. టీమిండియా సభ్యులు, వారి కుటుంబ సభ్యులు బుధవారం నాటికి ముంబై చేరుకుని మే 24 నుంచి బయో బబుల్‌లోకి ప్రవేశిస్తారు. జూన్ 2న ప్రత్యేక విమానంలో బ్రిటన్‌కు బయలుదేరతారు. మూడో తేదీ నుంచి భార‌త బృందం సౌథాంప్ట‌న్‌లో క‌ఠిన క్వారంటైన్‌లో ఉండ‌నుంది. జూన్ 18న కివీస్‌తో ప్ర‌పంచ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్స్ ఆడ‌నుంది. ఆ త‌రువాత నెల రోజుల సాధ‌న మ్యాచులు ఆడిన ఇంగ్లాండ్‌తో సుధీర్ఘ ఫార్మాట్‌లో త‌ల‌ప‌డుతుంది.
Next Story
Share it