భార‌త జట్టులో క‌రోనా క‌ల‌క‌లం.. ఇద్ద‌రు ఆట‌గాళ్ల‌కు పాజిటివ్‌

Two Indian cricketers tested positive in UK.ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు భార‌త జ‌ట్టు ప్ర‌స్తుతం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 July 2021 9:32 AM IST
భార‌త జట్టులో క‌రోనా క‌ల‌క‌లం.. ఇద్ద‌రు ఆట‌గాళ్ల‌కు పాజిటివ్‌

ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు భార‌త జ‌ట్టు ప్ర‌స్తుతం ఇంగ్లాండ్‌లో ప‌ర్య‌టిస్తోంది. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లింది భార‌త జ‌ట్టు. ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ ముగిసిన అనంత‌రం మూడు వారాల విరామం ఉండ‌డంతో ఆట‌గాళ్ల‌కు కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి బ‌య‌టికి వెళ్లేందుకు బీసీసీఐ అనుమ‌తి ఇచ్చింది. ఇక టెస్టు సిరీస్ ప్రారంభం కావ‌డానికి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డ‌డంతో ఆట‌గాళ్లంతా ఒక్క‌చోటికి వ‌చ్చారు. ఆట‌గాళ్లంద‌రూ డ‌ర్హ‌మ్ వెళ్లాల్సి ఉంది.

23 మందితో కూడిన క్రికెట‌ర్ల బృందంలో ఇద్ద‌రు ఆట‌గాళ్ల‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ఱార‌ణ అయ్యింది. అప్పటి నుంచి వారు ఐసోలేషన్‌లో ఉంటున్నారు. ఒకరు ఇంగ్లండ్‌లో ఉన్న తన బంధువు ఇంట్లో హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాడు. మరో క్రికెటర్‌కు ఇటీవలే నెగెటివ్ వచ్చింది. ఐతే స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీసీసీఐ అధికారి వెల్ల‌డించారు. వీరిని కలిసిన పలువురు క్రికెటర్లు కూడా మూడు రోజులు క్వారంటైన్‌లో ఉన్నారు. వారికి పరీక్షలు చేయగా అందరికీ నెగెటివ్ వచ్చింది.

డ‌ర్హ‌మ్‌లో భార‌త జ‌ట్టు మ‌రోసారి బ‌యోబబుల్‌లోకి వెళ్ల‌నుంది. ఆగ‌స్ట్ 4 నుంచి ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ ప్రారంభ‌మ‌వుతుంది. ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో ముందుగా ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది టీమ్ఇండియా. డ‌ర్హ‌మ్‌లో కౌంటీ ఛాంపియన్‌ఫిప్-XI జట్టుతో తలపడనుంది. యూకేలో క‌రోనా కేసులు పెరిగిపోతున్నాయ‌ని, అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఈ మ‌ధ్యే బీసీసీఐ సెక్ర‌ట‌రీ జే షా ఇండియ‌న్ టీమ్ స‌భ్యుల‌కు మెయిల్ పంపించ‌డం గ‌మ‌నార్హం.

Next Story