క్రికెట్ ఫ్యాన్స్‌కు డబుల్ కిక్..నేడే మహిళల వరల్డ్‌కప్, మెన్స్ టీ20 మ్యాచ్
నేడు రెండు ఇండియా క్రికెట్ మ్యాచ్‌లు ఫ్యాన్స్‌కు డబుల్ కిక్ ఇవ్వనున్నాయి
By - Knakam Karthik |
క్రికెట్ ఫ్యాన్స్‌కు డబుల్ కిక్..నేడే మహిళల వరల్డ్‌కప్, మెన్స్ టీ20 మ్యాచ్
నేడు రెండు ఇండియా క్రికెట్ మ్యాచ్‌లు ఫ్యాన్స్‌కు డబుల్ కిక్ ఇవ్వనున్నాయి. ఇండియా మహిళల వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ తో పాటు మెన్స్ జట్టు టీ20 మ్యాచ్ ఆడనుంది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఇండియా మూడో టీ20 మ్యాచ్ అడనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:45 గంటలకు మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్ జియో హాట్ స్టార్ లో, లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక లైవ్ టెలికాస్ట్ విషయానికి వస్తే స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ లో ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు. మరోవైపు మహిళల వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా సౌతాఫ్రికాతో తలపడనుంది. ఈ గ్రాండ్ ఫైనల్. ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరుగుతుంది. మ్యాచ్ మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభమవుతుంది.
అయితే భారత మహిళా క్రికెట్ జట్టు, దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు మహిళల ODI ప్రపంచ కప్ ఫైనల్‌లో తలపడనున్నాయి. రెండు జట్లు తమ తొలి ఐసిసి టైటిల్ కోసం చూస్తున్నాయి. 2017 ప్రపంచ కప్ ఫైనల్‌లో భారతదేశం హృదయ విదారకంగా ఉంది. టైటిల్ గెలుచుకోవడానికి అదే బహుశా వారికి ఉత్తమ అవకాశం. 2005 ODI ప్రపంచ కప్ ఫైనల్‌లో కూడా భారతదేశం ఫైనల్‌కు చేరుకుంది. దక్షిణాఫ్రికా తమ మొట్టమొదటి ODI ప్రపంచ కప్ ఫైనల్ ఆడనుంది. వారు మూడుసార్లు సెమీఫైనలిస్టులు. ఈరోజు నవీ ముంబైలో చరిత్ర సృష్టించబడుతుంది.
జట్లు:
భారత మహిళలు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్, అమంజోత్ కౌర్, రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్, స్నేహ రాణా,
సౌత్ ఆఫ్రికా: హర్లీన్ డియోల్ వోల్వార్డ్ట్ (కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, అన్నేకే బాష్, సునే లూయస్, మారిజానే కప్ప్, సినాలో జాఫ్తా, అన్నరీ డెర్క్‌సెన్, క్లో ట్రయాన్, నాడిన్ డి క్లర్క్, అయాబొంగా ఖాకా, నోంకులులేకో మ్లాబా, మసాబటా క్లాస్, తుమీ సెఖుదుఖునే, మసాబాటా క్లాస్, తుమీ సెఖుఖుమి,