సిరీస్‌పై భారత్ కన్ను.. తుది జట్టులో మార్పులుంటాయా..?
Today 3RD T20I match Between India and New zealand.న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు టీ20 సిరీస్‌పై కన్నేసింది.
By తోట వంశీ కుమార్ Published on 22 Nov 2022 5:53 AM GMTన్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు టీ20 సిరీస్‌పై కన్నేసింది. నేపియర్ వేదికగా నేడు కివీస్‌తో మూడో టీ20లో భారత్ తలపడనుంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్ లో విజయం ఇచ్చిన ఊపుతో టీమ్ఇండియా బరిలోకి దిగుతోంది. సారథిగా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ తొలి సిరీస్‌ను అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే.. తుది జట్టు ఎంపికలో తిప్పలు తప్పేలా లేవు. బ్యాటింగ్‌లో ఒక్క సూర్యకుమార్ యాదవ్ మినహా హార్దిక్‌తో సహా మిగిలిన వారు రెండో టీ20లో దారుణంగా విఫలం అయ్యారు. దీంతో సంజు శాంసన్‌ను జట్టులోకి తీసుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. శ్రేయాస్ స్థానంలో అతడికి అవకాశం ఇవ్వాలని అంటున్నారు. పంత్‌తో పాటు మిగిలిన బ్యాట్స్‌మెన్లు ఈ మ్యాచ్‌లో రాణించాలని లక్ష్మణ్ నేతృత్వంలోని టీమ్ మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందో లేదో చూడాలి.
మరోవైపు కెప్టెన్ కేన్ విలియమ్సన్ లేకుండానే కివీస్ జట్టు బరిలోకి దిగనుంది. వ్యక్తిగత కారణాలతో కేన్ మామ ఈ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. అతడి స్థానంలో సౌథీ జట్టు పగ్గాలు అందుకోన్నాడు. కేన్ లేకపోవడంతో ఫిన్ అలెన్, గ్లెన్ ఫిలిప్స్‌లపైనే మొత్తం బ్యాటింగ్ భారం పడనుంది. ప్రస్తుతం వీరిద్దరు ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు ఊరట నిచ్చే అంశం. వీరిద్దరితో పాటు జేమ్స్ నీషమ్, డేవిడ్ కాన్వే, మిచెల్‌లు రాణించాలని ఆ జట్టు మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది.
ఇక నేపియర్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. ఈ మ్యాచ్‌కు స్వల్ప వరుణుడి ముప్పు పొంచి ఉంది.