అర్ధ‌సెంచ‌రీ త‌ర్వాత ఆ స్పెష‌ల్ ప‌ర్స‌న్ కోసమే తిల‌క్ వ‌ర్మ సెల‌బ్రేష‌న్స్‌

తిలక్‌ వర్మ రెండో టీ20లో అద్భుతంగా రాణించాడు. 41 బంతుల్లో 51 పరుగులు చేశాడు.

By Srikanth Gundamalla  Published on  7 Aug 2023 12:43 PM IST
Tilak Varma, Team India, Cricket,  Rohit Daughter,

అర్ధ‌సెంచ‌రీ త‌ర్వాత ఆ స్పెష‌ల్ ప‌ర్స‌న్ కోసమే తిల‌క్ వ‌ర్మ సెల‌బ్రేష‌న్స్‌

టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్‌ టూర్‌లో ఉంది. వెస్టిండీస్‌తో ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడుతోంది. ఇండియా వర్సెస్ వెస్టిండీస్‌ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లోనే తెలుగు తేజం తిలక్‌ వర్మ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈ ఎడమ చేతి బ్యాటర్‌ ఆడిన రెండు మ్యాచుల్లోనూ రాణించాడు. ఇక రెండో టీ20లో అయితే అర్థ శతకం చేశాడు. 41 బంతుల్లో 51 పరుగులు చేశాడు. కానీ.. రెండో టీ20లోనూ వెస్టిండీస్ చేతిలో టీమిండియా ఓటమి పాలైంది.

అయితే.. తిలక్‌ వర్మ రెండో టీ20లో అద్భుతంగా రాణించాడు. 41 బంతుల్లో 51 పరుగులు చేశాడు. టీ20ల్లో తన అర్థ సెంచరీ తర్వాత రోహిత్‌ శర్మ కుమార్తె సమైరా కోసం సెలబ్రేషన్‌ చేస్తున్నట్లు తిలక్‌ వర్మ చెప్పాడు. ఎందుకంటే సమైరాతో అతనికి సన్నిహిత సంబంధం ఉందని చెప్పాడు. అయితే.. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేసింది. మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన తిలక్‌ వర్మ తనకు రోహిత్‌ శర్మ కూతురు సమైరాతో ఉన్న అనుబంధాన్ని తెలిపాడు. తాను సమైరాను స్వామి అని పిలుస్తానని చెప్పాడు. తొలి సెంచరీ, తొలి అర్థ సెంచరీ సాధించినప్పుడు సమైరా కోసం సెలబ్రేషన్ చేస్తానని మాట ఇచ్చినట్లు పేర్కొనాడు తిలక్‌ వర్మ. హాఫ్‌ సెంచరీ సాధించిన తర్వాత రోహిత్‌ శర్మ కూతురుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇక రోహిత్‌ శర్మతో కూడా తన అనుంబంధం బాగుంటుందని.. ఆటలో మెళకువలు చెబుతుంటాడని తెలిపాడు తిలక్ వర్మ.

కాగా..వెస్టిండీస్‌తో జరిగిన మొదటి, రెండో టీ20ల్లో భారత జట్టు ఓటమి పాలైంది. బ్యాటింగ్‌ టాప్ ఆర్డర్‌ అంతగా రాణించలేకపోయింది. బ్యాటింగ్‌పై కెప్టెన్‌ హార్దిక్‌ ప్యాండ్యా కూడా స్పందించారు. ఇంకా బాగా పెర్ఫార్‌మెన్స్‌ ఇవ్వాల్సింది అని చెప్పాడు. కానీ.. నాలుగోస్థానంలో బ్యాటింగ్‌కు దిగిన తిలక్‌ వర్మ మాత్రం బాగా ఆడినట్లు చెప్పాడు. తిలక్‌ వర్మ సూపర్‌ అంటూ పొడిగాడు కెప్టెన్ హార్దిక్‌ పాండ్యా.

Next Story