పురుషుల T20I బ్యాటర్‌ల లిస్టులో తిలక్ వర్మ దుమ్ముదులిపాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజా ర్యాంకింగ్స్‌లో తిలక్ వర్మ 69 స్థానాలు ఎగబాకి 3వ స్థానానికి చేరుకున్నాడు. తిలక్ ఈ జాబితాలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను అధిగమించి అత్యధిక ర్యాంక్ కలిగిన భారత T20I బ్యాటర్ అయ్యాడు. ముంబై ఇండియన్స్ స్టార్ ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్, ఇంగ్లండ్‌కు చెందిన ఫిల్ సాల్ట్ తర్వాతి స్థానంలో తిలక్ వర్మ ఉన్నాడు. తిలక్ వర్మ తన టీ20 కెరీర్‌లో తొలిసారి టాప్ 10లోకి ప్రవేశించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన T20I సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు బాదాడు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా అందుకున్నాడు. 3-1తో భారత్‌ను కైవసం చేసుకోవడంతో తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌ను గెలుచుకున్నాడు. 198 స్ట్రైక్ రేట్‌తో 280 పరుగులు చేశాడు, నాలుగు మ్యాచ్‌లలో 20 సిక్సర్లు కొట్టాడు.
ఈ ఏడాది ఆరంభంలో నంబర్ 1 స్థానంలో నిలిచిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానానికి దిగజారాడు. అయితే సూర్య తన నంబర్ 3 స్థానాన్ని తిలక్ కోసం త్యాగం చేశాడు. ఈ సిరీస్‌లో రెండు సెంచరీలు చేసిన సంజూ శాంసన్ తాజా బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 17 స్థానాలు ఎగబాకి 22వ స్థానానికి చేరుకున్నాడు. శాంసన్ తన చివరి ఐదు ఇన్నింగ్స్‌లలో 3 సెంచరీలు సాధించి సంచలన ఫామ్‌లో ఉన్నాడు.
టాప్ 30లో భారత బ్యాటర్లు - ICC T20I ర్యాంకింగ్స్
3. తిలక్ వర్మ - 806 రేటింగ్ పాయింట్లు
4. సూర్యకుమార్ యాదవ్ - 788 పాయింట్లు
8. యశస్వి జైస్వాల్ - 706 పాయింట్లు
15. రుతురాజ్ గైక్వాడ్ - 619 పాయింట్లు
22. సంజు శాంసన్ - 598 పాయింట్లు
టీ20ల్లో పురుషుల ఆల్‌రౌండర్ల ఐసీసీ ర్యాంకింగ్స్‌లో హార్దిక్ పాండ్యా మళ్లీ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.