హ్యాట్రిక్ సెంచరీలు.. టీ20 లలో దుమ్ము దులుపుతున్న తెలుగోడు

భారత బ్యాటర్ తిలక్ వర్మ అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తూ ఉన్నాడు. శనివారం T20 క్రికెట్‌లో చరిత్రను సృష్టించాడు.

By Kalasani Durgapraveen  Published on  23 Nov 2024 9:04 AM GMT
హ్యాట్రిక్ సెంచరీలు.. టీ20 లలో దుమ్ము దులుపుతున్న తెలుగోడు

భారత బ్యాటర్ తిలక్ వర్మ అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తూ ఉన్నాడు. శనివారం T20 క్రికెట్‌లో చరిత్రను సృష్టించాడు. రాజ్‌కోట్‌లో మేఘాలయతో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024-25 మ్యాచ్ లో హైదరాబాద్ తరపున 67 బంతుల్లో 151 పరుగులు చేశాడు. తిలక్ వర్మ T20 క్రికెట్‌లో వరుసగా మూడు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు కొట్టిన మొదటి ఆటగాడుగా చరిత్ర సృష్టించాడు.

22 ఏళ్ల వర్మ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024-25 సీజన్ లో కూడా సత్తా చాటుతున్నాడు. ఇటీవల T20 సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాలో వరుసగా రెండు సెంచరీలు కొట్టాడు తిలక్ వర్మ. సెంచూరియన్‌లో 107 నాటౌట్, జోహన్నెస్‌బర్గ్‌లో అజేయంగా 120 పరుగులు చేశాడు. మేఘాలయపై అద్భుతమైన సెంచరీ చేసిన తిలక్ టోర్నమెంట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ను కూడా నమోదు చేశాడు. ముంబై ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ చేసిన 147 పరుగుల రికార్డును తిలక్ అధిగమించాడు. T20 మ్యాచ్‌లో 150 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన రెండవ భారతీయ క్రికెటర్‌గా కూడా తిలక్ నిలిచాడు. 2022లో అజేయంగా 162 పరుగులతో కిరణ్ నవ్‌గిరే పేరిట ఈ రికార్డు ఉంది.

Next Story