గోల్ఫ్ ఆటగాడు టైగర్ వుడ్స్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయడ్డాడు. మంగళవారం ఉదయం కాలిఫోర్నియాలో అతడు ప్రయాణిస్తున్న కారు.. ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో కారు రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారుకు ఓవైపు నుజ్జునుజ్జవగా.. టైగర్ వుడ్స్ అందులోనే ఇరుక్కుపోయాడు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక, పారామెడికల్ సిబ్బంది ఆయనను కారు నుంచి బయటకు తీసి హాస్పిటల్‌కు తరలించారు.
అయితే.. ప్రమాదంలో టైగర్ కాలికి తీవ్ర గాయాలవగా.. వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. బ్లాక్ హార్స్ రోడ్డు మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు కారులో టైగర్ వుడ్స్ ఒక్కరే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలావుంటే.. టైగర్ వుడ్స్ ప్రమాదానికి గురవడం ఇదే తొలిసారి కాదు. గతంలో రెండుసార్లు 2009, 2017లోనూ ఆయన కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదాల అనంతరం కొద్ది నెలలకు కోలుకుని గోల్ఫ్‌లోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. మరోసారి టైగర్ రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రపంచ టాప్ గోల్ప్ ఆటగాళ్లో ఇకడిగా ఉన్న టైగర్ వుడ్స్.. ఇప్పటి వరకు 15 మేజర్ గోల్ఫ్ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకున్నాడు.