తన స్ట్రైక్ రేట్ గురించి విమర్శలు చేస్తున్న వారికి విరాట్ ఇచ్చిన రిప్లై ఇదే!

ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది.

By అంజి  Published on  29 April 2024 7:45 PM IST
Virat Kohli, strike rate, IPL 2024

తన స్ట్రైక్ రేట్ గురించి విమర్శలు చేస్తున్న వారికి విరాట్ ఇచ్చిన రిప్లై ఇదే! 

ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో విల్ జాక్స్ సెంచరీతో కదంతొక్కగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 70 పరుగులు చేశాడు. 201 పరుగుల లక్ష్యాన్ని RCB తేలికగా ఛేదించింది. 41 బంతుల్లో 100 నాటౌట్‌తో విల్ జాక్స్‌ భీభత్సం సృష్టించాడు. ఇక విరాట్ కోహ్లీ మ్యాచ్ తర్వాత తన స్ట్రైక్ రేట్ గురించి వస్తున్న కామెంట్లపై స్పందించాడు.

కొందరు తన స్ట్రైక్ రేట్‌ గురించి మాట్లాడతారని.. ఇంకొందరు నేను స్పిన్ బాగా ఆడనని అంటారని.. వీటన్నిటినీ తాను ఏ మాత్రం పట్టించుకోనని కోహ్లీ తెలిపాడు. ''కామెంట్లు చేసేవారికి క్రికెట్‌ పెద్దగా తెలియకపోవచ్చు.. ఆటగాళ్లు ప్రతి మ్యాచులోనూ విజయం కోసమే ఆడతారని.. నేనూ అలా ఆడుతున్నా కాబట్టే 15 ఏళ్లుగా క్రికెట్‌లో కొనసాగుతున్నానని కోహ్లీ తెలిపాడు. నేను బయట నుంచి వచ్చే కామెంట్లను పెద్దగా పట్టించుకోనని.. అలా కూర్చుని కామెంట్లు చేసేవారిలో చాలా మందికి మ్యాచు పరిస్థితి ఏంటనేది తెలియదు'' అని కోహ్లీ అన్నాడు.

ఫ్యాన్స్ ఎప్పుడూ కూడా మా నుంచి మెరుగైన ప్రదర్శనను ఆశిస్తారు.. అందులో తప్పు లేదు. మ్యాచ్ పరిస్థితిని బట్టి మేం ఆడాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఉన్నతస్థాయిలో క్రికెట్ ఆడిన వ్యక్తులు ఈ తరహా వ్యాఖ్యలు చేయరు.. సగం సగం తెలిసిన వారే ఇలా మాట్లాడుతుంటారంటూ గట్టిగా ఇచ్చేశాడు విరాట్ కోహ్లీ.

Next Story