ది గ్రేట్‌ ఖలీ కి ఏమైంది..? ఎందుకు క‌న్నీళ్లు పెట్టుకున్నాడు..?

The Great Khali spotted wiping tears while posing for camera.న‌వ్వుతూ ఫోటోల‌కు ఫోజులిచ్చిన ఖ‌లీ ఉన్న‌ట్టుండి భావోద్వేగానికి గురైయ్యాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Aug 2022 6:43 AM GMT
ది గ్రేట్‌ ఖలీ కి ఏమైంది..? ఎందుకు క‌న్నీళ్లు పెట్టుకున్నాడు..?

డబ్ల్యూడబ్ల్యూఈ(వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్) అంటే భార‌తీయుల‌కు ఠ‌కున్న గుర్తుకు వ‌చ్చే పేరు ది గ్రేట్ ఖ‌లీ. హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌కు చెందిన ద‌లీప్ సింగ్ రానా డబ్ల్యూడబ్ల్యూఈలో ది గ్రేట్ ఖ‌లీ గుర్తింపు తెచ్చుకున్నాడు. హాలీవుడ్‌తో పాటు ప‌లు బాలీవుడ్ చిత్రాల్లోనూ న‌టించాడు. అయితే.. ఫోటోగ్రాఫ‌ర్ల‌కు ఫోజులిస్తూ ఖ‌లీ క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఓ ఇంట్లో నుంచి బయటకు వస్తున్న ఖలీని ఫోటోల‌కు ఒక్క ఫోజు ఇవ్వాల‌ని వీడియో గ్రాఫ‌ర్లు, ఫోటో గ్రాఫ‌ర్లు కోరారు. అక్క‌డే ఉన్న అభిమానులు కూడా అడ‌గ‌డంతో ఖ‌లీ కాద‌న‌లేక‌పోయాడు. న‌వ్వుతూ ఫోటోల‌కు ఫోజులిచ్చిన ఖ‌లీ ఉన్న‌ట్టుండి భావోద్వేగానికి గురైయ్యాడు. క‌ళ్లు తుడుచుకుంటూ లోప‌లికి వెళ్లిపోయాడు. ఈ హ‌ఠాత్ ప‌రిణామంతో అక్క‌డ ఉన్న వారు ఆశ్చ‌ర్యానికి గురైయ్యారు.

కాగా.. గ్రేట్ ఖ‌లీ ఎందుకు క‌న్నీళ్లు పెట్టుకున్నాడ‌న్న విష‌యంలో స్ప‌ష్ట‌త లేదు. అభిమానుల అభిమానానికి క‌న్నీళ్లు వ‌చ్చారు. లేదంటే అక్క‌డ ఉన్న గుంపులో ఎవ‌ర‌న్నా ఏమైనా అనడంతో నొచ్చుకున్నాడా..? అన్న‌ది తెలియాల్సి ఉంది.

Next Story
Share it