ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధత
పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది
By Kalasani Durgapraveen Published on 7 Dec 2024 6:30 AM ISTపాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఛాంపియన్స్ ట్రోఫీ జరగడం అనుమానంగా ఉండేది. పాకిస్థాన్‌ను ఎట్టిపరిస్థితుల్లో ఇండియాకు పంపించమని బీసీసీఐ స్పష్టం చేయడం.. మరోవైపు హైబ్రిడ్ మోడల్‌లోనే టోర్నీ నిర్వహిస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పట్టుబట్టడంతో.. టోర్నీ నిర్వహణపై అనిశ్చితి ఏర్పడింది. ఐసీసీ నిర్వహించిన సమావేశంలో పాక్ బోర్డు హైబ్రిడ్ మోడల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు షరతులతో అంగీకరించింది. హైబ్రిడ్ మోడల్ కారణంగా తమ ఆదాయానికి గండి పడుతుందని, కాబట్టి ఐసీసీ నుంచి వచ్చే రెవెన్యూను అధిక మొత్తంలో పెంచాలని షరతు పెట్టింది. తమ జట్టును కూడా ఇండియాకు పంపించమని మరో షరతు తెలిపింది.
భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ ఒప్పందం నిర్వహించడానికి ఐసీసీ చర్యలు తీసుకున్నట్లు పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి. వచ్చే మూడేళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుందని తెలిపింది. ఒప్పందంలో భాగంగా వచ్చే మూడేళ్లలో భారత్-పాక్ తలపడే మ్యాచ్‌లు.. తమ సొంతగడ్డపై నిర్వహించడానికి కుదరదు. తటస్థ వేదిక అయిన దుబాయ్‌లో నిర్వహించాల్సి ఉంటుంది.అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మినహా మెగాటోర్నీలకు పాకిస్థాన్ ఇప్పట్లో ఆతిథ్యం ఇచ్చే పరిస్థితులు లేవు.