25 ఏళ్ల‌కే యాష్లే బార్టీ సంచ‌ల‌న నిర్ణ‌యం.. టెన్నిస్‌కు గుడ్‌బై

Tennis World No 1 Ashleigh Barty announces retirement at 25.మ‌హిళ‌ల టెన్నిస్ ప్రపంచ నెంబర్‌ వన్‌, ఆస్ట్రేలియా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 March 2022 6:25 AM GMT
25 ఏళ్ల‌కే యాష్లే బార్టీ సంచ‌ల‌న నిర్ణ‌యం.. టెన్నిస్‌కు గుడ్‌బై

మ‌హిళ‌ల టెన్నిస్ ప్రపంచ నెంబర్‌ వన్‌, ఆస్ట్రేలియా ప్లేయర్‌ యాష్లే బార్టీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. 25 ఏళ్ల యాష్లే బార్టీ ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ నుంచి రిటైర్‌ అవుతున్నట్లు బుధ‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు ఓ వీడియోను షేర్ చేసింది. ఆమె ప్ర‌క‌ట‌న చూసి యావ‌త్త్ క్రీడా ప్ర‌పంచం ఆశ్చ‌ర్య‌పోయింది.

'ఇది ఎంతో క‌ఠినమైన నిర్ణ‌యం. మీకు ఎలా చెప్పాలో అర్థం కావ‌డం లేదు. ఇందుకోసం నా ఫ్రెండ్ సాయం తీసుకున్నా. టెన్నిస్‌కు వీడ్కోలు చెబుతున్నా. అయిన‌ప్ప‌టికీ నేను సంతోషంగానే ఉన్నా. ఈ గేమ్ కోసం నా వంతు కృషి చేశా. ఈ క్రీడలో ఉన్నత స్థాయికి చేరుకున్నందుకు నాకు గర్వంగా ఉంది. నాకు మద్దతునిచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రిటైర్‌మెంట్ తీసుకోవ‌డానికి ఇదే స‌రైన స‌మ‌యం అని బావిస్తున్నా. నాకున్న మిగతా కలల్ని కూడా నెరవేర్చుకోవాలి' అని వీడియోలో బార్టీ చెప్పుకొచ్చింది.

కెరీర్‌ విషయానికొస్తే.. మూడుసార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ గా నిలిచింది. 2019లో ఫ్రెంచ్‌ ఓపెన్‌, 2021లో వింబుల్డన్‌, ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ను గెలిచింది. 44 సంవ‌త్స‌రాల త‌రువాత ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌, 41 ఏళ్ల త‌రువాత వింబుల్డ‌న్ ఓపెన్ గెలిచిన ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా యాష్లే రికార్డు సృష్టించింది. ఇక.. యాష్లే బార్టీకి క్రికెట్ అంటే కూడా ఇష్టం. 2015లో ఆమె కొద్ది రోజులు బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆడింది.

Next Story
Share it