కొత్త బాధ్య‌త‌లు, కొత్త స‌వాళ్లు, కొత్త ప్రారంభం.. కోచ్‌గా ద్రావిడ్ తొలి రోజు

Team India's Practice Session With Coach Rahul Dravid.టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌తో ప్ర‌ధాన కోచ్‌గా ర‌విశాస్త్రి ప‌దవికాలం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Nov 2021 10:24 AM GMT
కొత్త బాధ్య‌త‌లు, కొత్త స‌వాళ్లు, కొత్త ప్రారంభం.. కోచ్‌గా ద్రావిడ్ తొలి రోజు

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌తో ప్ర‌ధాన కోచ్‌గా ర‌విశాస్త్రి ప‌దవికాలం ముగియ‌గానే.. అత‌డి స్థానంలో రాహుల్ ద్రావిడ్‌ను భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. యూఏఈ నుంచి భార‌త్‌కు చేరుకున్న ఆట‌గాళ్లు జైపూర్‌కు వ‌చ్చారు. రేపు కివీస్‌తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్ కోసం క‌స‌ర‌త్తులు మొదలు పెట్టారు. సోమ‌వారం తొలిసారి ద్రావిడ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో టీమ్‌ప్రాక్టీస్ చేసింది. ఇక ఇదే సిరీస్‌తో కెప్టెన్ గా రోహిత్ త‌న ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్ట‌నున్నాడు. ప్రాక్టీస్ సెష‌న్‌లో ద్రావిడ్ టీ20 కొత్త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌కు త్రో బాల్స్ వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకుంది.

కొత్త బాధ్య‌త‌లు, కొత్త స‌వాళ్లు, కొత్త ప్రారంభం అంటూ బీసీసీఐ అభిమానుల కోసం ఈ వీడియోను పంచుకుంది. ద్రావిడ్ రాక‌తో జ‌ట్టులో నూత‌న ఉత్సాహం వ‌చ్చిన‌ట్లు పేర్కొంది. ఇక ద్రావిడ్ త‌న‌దైన శైలిలో ప్లేయ‌ర్ల‌కు శిక్ష‌ణ ఇచ్చాడు. ఆట‌గాళ్ల‌కు కొన్ని విలువైన సూచ‌న‌లు చేశాడు. ఇక తొలి టీ20కి అతిథ్యం ఇస్తున్న జైపూర్‌లోని స‌వాయి మాన్‌సింగ్ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం అనే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇరు జ‌ట్ల‌లోనూ హిట్ట‌ర్లు ఉండ‌డంతో ఈ మ్యాచ్‌లో ప‌రుగుల వ‌ర‌ద పార‌డం ఖాయంగానే క‌నిపిస్తుంది. 2021 టీ20ల్లో ఎదురైన ప‌రాభ‌వాన్ని మ‌రిచి.. కొత్త కోచ్‌, కొత్త కెప్టెన్ ఆధ్వ‌ర్యంలో వ‌చ్చే ఏడాది అక్టోబ‌ర్‌లో జ‌ర‌గ‌బోయే 2022 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కోసం ఇప్ప‌టి నుంచే స‌న్న‌ద్ద‌త‌ను మొదలుపెట్టింది. ఇటు కోచ్‌గా ద్రావిడ్‌.. అటు కెప్టెన్‌గా రోహిత్‌కు ఈ సిరీస్ ఎంతో కీల‌కం కానుంది.

Next Story
Share it