ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తైన క‌ట్ట‌డంపై మెరిసిన టీమిండియా జెర్సీ

Team India's new jersey displayed at Burj Khalifa.యూఏఈ, ఒమ‌న్ వేదిక‌గా అక్టోబ‌ర్ 17 నుంచి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ప్రారంభం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Oct 2021 6:21 PM IST
ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తైన క‌ట్ట‌డంపై మెరిసిన టీమిండియా జెర్సీ

యూఏఈ, ఒమ‌న్ వేదిక‌గా అక్టోబ‌ర్ 17 నుంచి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ప్రారంభం కానుంది. ఈ పొట్టి ఫార్మాట్‌లో భార‌త ఆట‌గాళ్లు కొత్త జెర్సీల్లో క‌నిపించ‌నున్నారు. ఆట‌గాళ్లు ధ‌రించే జెర్సీని భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) మ‌రియు కిట్​ స్పాన్సర్​ ఎంపీఎల్​ స్పోర్ట్స్ సంయుక్తంగా ఆవిష్క‌రించాయి. కాగా.. ఈ జెర్సీని 'బిలియ‌న్ చీర్స్ జెర్సీ' అని పిలుస్తార‌ని బీసీసీఐ తెలిపింది. పాత జెర్సీతో పోలిస్తే.. కొత్త జెర్సీ డార్క్ బ్లూ క‌ల‌ర్‌లో ఉంది. 'అభిమానుల గుర్తుగా జెర్సీని రూపొందించడం భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో ఇదే తొలిసార‌ని, గ‌త మేటి మ్యాచ్‌ల సంద‌ర్భంగా అభిమానులు చేసిన నినాదాలు, హ‌ర్ష‌ధ్యానాలు జెర్సీపై ఉంటాయ‌ని' ఎంపీల్ స్పోర్ట్స్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌లో భార‌త ఆట‌గాళ్లు ధరించబోయే జెర్సీకి సంబంధించిన చిత్రాలను ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్‌ 'బుర్జ్‌ ఖలీఫా'పై బుధవారం రాత్రి ప్రదర్శించారు. జెర్సీ కి సంబంధించిన వీడియోల‌ను సైతం ప్ర‌ద‌ర్శించారు. టీమ్ ఇండియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్‌ రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాలు ఫోటోలు త‌ళుక్కున మెరిశాయి. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Next Story