వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్ టాస్ గెలిచింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. సీమ్, పేస్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై ముందుగా బౌలింగ్ చేయాలని ఇరు జట్లు భావించాయి. అయితే భారత్ టాస్ గెలవడంతో బౌలింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా ఈ మ్యాచ్ లో నాలుగు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగుతోంది. అశ్విన్‌కు చోటు దక్కలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా అశ్విన్‌ను జట్టులోకి తీసుకోలేదని రోహిత్ పేర్కొన్నాడు. కేఎస్ భరత్ కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు.
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ(w), పాట్ కమిన్స్(c), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, శ్రీకర్ భరత్(w), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్