రెండో టీ20లోనూ భారత్‌ గెలుపు.. సిరీస్ కైవసం

మూడు మ్యాచ్‌ల టీ20ల్లో ఇప్పటికే భారత్‌ రెండింట్లో గెలిచింది. దాంతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  29 July 2024 6:57 AM IST
team india, won, 2nd t20,  sri lanka,

రెండో టీ20లోనూ భారత్‌ గెలుపు.. సిరీస్ కైవసం 

టీమిండియా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉంది. సూర్యకుమార్ యాదవ్‌ కెప్టెన్సీలో టీ20 సిరీస్ ఆడుతోంది. మూడు మ్యాచ్‌ల టీ20ల్లో ఇప్పటికే భారత్‌ రెండింట్లో గెలిచింది. దాంతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత్‌ 7 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. 9 బంతులు ఇగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది టీమిండియా. మొత్తంగా మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే టీ20 సిరీస్‌ను 2-0తో గెలుచుకుంది. రెండో టీ20లో మొదట శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.

టాపార్డర్‌లో కుశాల్‌ పెరీరా (34 బంతుల్లో 53) అర్ధసెంచరీ చేశాడు. ఓపెనర్‌ నిసాంక (24 బంతుల్లో 32) మంచి ఇన్నింగ్స్‌ను ఆడాడు. ఈ మ్యాచ్‌లో రవి బిష్ణోగ్‌ బౌలింగ్‌తో అదరగొట్టాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు. రవి బిష్ణోయ్‌ (3/26) కీలక వికెట్లు తీసి లంక ఇన్నింగ్స్‌కు అడ్డుకట్ట వేశాడు. అర్షదీప్‌సింగ్, అక్షర్‌ పటేల్, హార్దిక్‌ పాండ్యా తలా 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్‌ లక్ష్యఛేదనకు దిగగానే వానొచ్చి మ్యాచ్‌ను ఆటంక పరచడంతో లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులుగా సవరించారు.

టీమిండియా 6.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 81 పరుగుల టార్గెట్‌ను చేదించింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (15 బంతుల్లో 30), సూర్యకుమార్‌ (12 బంతుల్లో 26), హార్దిక్‌ పాండ్యా (9 బంతుల్లో 22 నాటౌట్‌) నిలిచారు. సిరీస్‌లో చివరిదైన మూడో టి20 మ్యాచ్‌ మంగళవారం జరుగనుంది. అయితే.. వర్షం పడిన తర్వాత భారత్ లక్ష్యం 8 ఓవర్లలో 78 పరుగులుగా మారింది. 45 బంతుల్లో 72 పరుగుల సమీకరణం భారత్‌కు ఏమంత కష్టం కాలేదు. సంజూ సామ్సన్‌ (0) డకౌటైనా... కెప్టెన్ సూర్యకుమార్, ఓపెనర్‌ యశస్వి గెలుపు అంచుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్‌ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. విజయాన్ని అందించాడు.

Next Story