త్వరగా కోలుకో.. మళ్లీ అందరం కలిసి క్రికెట్ ఆడుదాం
Team India wishes 'fighter' Rishabh Pant a speedy recovery.యువ ఆటగాడు రిషబ్ పంత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన
By తోట వంశీ కుమార్ Published on 3 Jan 2023 3:18 PM ISTయువ ఆటగాడు రిషబ్ పంత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రిషబ్ త్వరగా కోలుకుని తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌తో పాటు భారత ఆటగాళ్లు ఆకాంక్షించారు. మళ్లీ పాత రోజుల్లా ఆటను ఆస్వాదిద్దామంటూ పంత్‌కు ఓ వీడియో సందేశం పంపారు.
'రిషబ్ పంత్ త్వరగా కోలుకో. గత సంవత్సరం కాలంగా టెస్ట్ క్రికెట్‌లో భారత జట్టుకు అవసరమైన ప్రతిసారీ అద్భుత ఇన్నింగ్స్ లు ఆడావు. నీ ఆటను దగ్గరుండి చూసినందుకు ఎంతో సంతోషిస్తున్నా. కఠినమైన పరిస్థితుల్లో పట్టుదలగా నిలబడడం నీకు అలవాటు కదా. అలాగే ఇది కూడా ఓ సవాల్ అని బావించు. త్వరగా కోలుకుని తిరిగి బలంగా తిరిగి వస్తావు. నిన్ను మళ్లీ జట్టులో చూడాలని ఉంది బడ్డీ' అంటూ రాహుల్ ద్రావిడ్ అన్నాడు.
💬 💬 You are a fighter. Get well soon 🤗 #TeamIndia wish @RishabhPant17 a speedy recovery 👍 👍 pic.twitter.com/oVgp7TliUY
— BCCI (@BCCI) January 3, 2023
ఆల్ రౌండర్ హార్డిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ తదితరులు.. 'పంత్ త్వరగా కోలుకుని తిరిగి వచ్చేయి. మళ్లీ అంతా కలిసి క్రికెట్ ఆడుదాం.' అని అన్నారు. ఈ వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
కాగా.. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ముంబై వేదికగా తొలి మ్యాచ్‌లో భారత జట్టు తలపడనుంది. హార్థిక్ సారథ్యంలోనే యువ జట్టు ఎలా రాణిస్తుందో చూడాల్సిందే.