దక్షిణాఫ్రికా టూర్‌కు టీమిండియా.. వారిద్దరూ ఎక్కడ..?
ఆస్ట్రేలియాతో ప్రస్తుతం భారత్ టీ20 సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ తర్వాత టీమిండియా దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లనుంది.
By Srikanth Gundamalla Published on 1 Dec 2023 12:56 PM ISTదక్షిణాఫ్రికా టూర్‌కు టీమిండియా.. వారిద్దరూ ఎక్కడ..?
ఆస్ట్రేలియాతో ప్రస్తుతం భారత్ ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ తర్వాత టీమిండియా దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లనుంది. అక్కడ వారితో 3 టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. డిసెంబర్ 10 నుంచి వచ్చే 2024 జనవరి 7వ తేదీ వరకు టీమిండియా దక్షిణాఫ్రికా టూర్‌లో ఉండనుంది. అయితే.. ఇప్పటికే ఆయా ఫార్మట్లకు బీసీసీఐ టీమ్‌లను ప్రకటించింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో సీనియర్లకు సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. కానీ.. టెస్టు జట్టులో మాత్రం వారికి తిరిగి అవకాశం లభించింది. రెండు టెస్టు సిరీస్‌లలో భారత్ పూర్తిస్థాయి జట్టు బరిలోకి దిగుతోంది. కానీ.. టెస్టుల్లో ఎక్కువగా కనిపించే ఆ ఇద్దరు సీనియర్ ప్లేయర్లకు మాత్రం అవకాశం లభించలేదు.
రోహిత్ శర్మ, గిల్, జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, మహ్మద్ షమీ, బుబ్రా, ప్రసిధ్ కృష్ణతో టెస్టు టీమ్ పటిష్టంగా కనిపిస్తోంది. అయితే.. ఈ టీమ్‌లో ఎంతో అనుభవం ఉన్న సీనియర్ ఆటగాళ్ల పేర్లు కనిపించకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నయా వాల్ చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే పేర్లు సౌతాఫ్రికా టూర్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో లేకపోడంతో వీరి కెరియర్‌పై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. వీరి టెస్ట్ కెరియర్‌కు ఎండ్ కార్డు పడినట్లేనా అని చర్చించకుంటున్నారు క్రికెట్ అభిమానులంతా.
అయితే.. ఇటీవల కాలంలో రహానె, పుజారా వారి స్థాయికి తగినట్లుగా రాణించలేదని.. అందుకే సెలెక్టర్లు వీరిని పక్కనపెట్టారని తెలుస్తోంది. వీరి వయసు కూడా కొంత సమస్యగా మారిందని అంటున్నారు. అదీకాక.. యువ ఆటగాల్లు బాగా రాణిస్తుండటంతో వారికి అవకాశం కల్పించారు. పుజారా, రహానేలను దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంతో వారి కెరీర్‌లు ముగిసినట్లే అని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.