కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ ఫామ్.. సచిన్, ధోనీ రికార్డ్స్ బ్రేక్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.
By Srikanth Gundamalla Published on 5 Aug 2024 6:57 AM ISTకెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ ఫామ్.. సచిన్, ధోనీ రికార్డ్స్ బ్రేక్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. శ్రీలంకతో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆదివారం జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో వరుసగా మరో హాఫ్ సెంచరీ చేశాడు. తద్వారా ఎన్నో ఏళ్లుగా సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును కెప్టెన్ రోహిత్ శర్మ బ్రేక్ చేశాడు. కొత్త చరిత్రను సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత ఓపెనర్లలో అత్యధికంగా 50 ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ఆదివారం సాధించిన 64 స్కోర్‌తో ఓపెనర్‌గా రోహిత్ 50 ప్లస్ స్కోర్ల సంఖ్య 121కి చేరింది. 120 సార్లు 50కిపైగా స్కోర్లు సాధించిన సచిన్‌ను హిట్‌మ్యాన్ అధిగమించాడు.
ఇక అంతర్జాతీయంగా చూస్తే ఈ జాబితాలో హిట్‌మ్యాన్ ఆరో స్థానంలో న్నాడు. 146 (374 మ్యాచ్‌లు) ఫిఫ్టీ ప్లస్ స్కోర్లతో డేవిడ్ వార్నర్ అగ్రస్థానంలో నిలిచాడు. 144 (441 మ్యాచ్‌లు) ఫిఫ్టీ ప్లస్ స్కోర్లతో రెండో స్థానంలో క్రిస్ గేల్, 136తో (506 మ్యాచ్‌లు) సనత్ జయసూర్య 3వ స్థానంలో, 131తో (354 మ్యాచ్‌లు) డెస్మండ్ హేన్స్ 4వ స్థానంలో, 125తో (342 మ్యాచ్‌లు) గ్రేమ్ స్మిత్ 5వ స్థానంలో ఉన్నారు.
ఇదే సమయంలో ధోనీ రికార్డును కూడా బ్రేక్ చేసిన ఘనతను రోహిత్ శర్మ అందుకున్నాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో టీమిండియా మజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని హిట్‌మ్యాన్ అధిగమించాడు. ధోనీ మొత్తం 10,773 సాధించగా శ్రీలంకతో రెండో వన్డేలో సాధించిన 64 పరుగులతో కలుపుకొని రోహిత్ మొత్తం రన్స్ 10,831కు చేరాయి. దీంతో వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ 5వ స్థానానికి చేరగా.. ఎంఎస్ ధోనీ 6వ స్థానానికి పడిపోయాడు. వీరి కంటే ముందు సచిన్ తెందూల్కర్, విరాట్ కోహ్లి, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ వరుస స్థానాల్లో ఉన్నారు.
మరో వైపు వన్డే సిరీస్ లో సత్తా చాటుతోంది. తొలి వన్డేను డ్రాగా ముగించిన విషయం తెలిసిందే. రెండో వన్డే మ్యాచ్ లో విజయాన్ని అందుకుంది. టీమిండియాను 32 పరుగుల తేడాతో ఓడించింది. శ్రీలంక లెగ్ స్పిన్నర్ జెఫ్రీ వాండర్సే 6 వికెట్లు తీసి భారత్ ను దెబ్బతీశాడు.