విశ్వవీరులొచ్చారు.. ఢిల్లీలో టీమిండియాకు ఘనస్వాగతం

టీ20 వరల్డ్ కప్‌ గెలిచిన తర్వాత టీమిండియా భారత్‌ కు చేరుకుంది.

By Srikanth Gundamalla  Published on  4 July 2024 7:48 AM IST
team india,   delhi,  icc t20 world cup,

 విశ్వవీరులొచ్చారు.. ఢిల్లీలో టీమిండియాకు ఘనస్వాగతం 

టీ20 వరల్డ్ కప్‌ గెలిచిన తర్వాత టీమిండియా భారత్‌ కు చేరుకుంది. హరికేన్ తుపాను కారణంగా కాస్త ఆలస్యంగా వచ్చారు. తాజాగా గురువారం ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఉదయం జట్టు సభ్యుల ప్రత్యేక విమానం ఢిల్లీలో ల్యాండ్ అయ్యింది. సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమిండియా భారత్‌కు చేరుకోవడం.. కప్‌ భారత్‌లో దిగడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే టీమిండియాకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. అభిమానులు, అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. కాగా. ఉదయం 11 గంటలకు రోహిత్ సేనతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం అవుతారు. ఈ సందర్భంగా టీమిండియా క్రికెటర్లను ప్రధాని మోదీ సన్మానం చేస్తారు. అభినందనలు తెలపనున్నారు. కాసేపు చర్చల తర్వాత.. ప్రత్యేక విమానంలో భారత ఆటగాళ్లు ముంబైకి బయల్దేరనున్నారు. అక్కడ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రోడ్‌షో ఏర్పాటు చేస్తారు. రోడ్‌షోలో టీమిండియా కప్‌తో పాటు పాల్గొంటారు. రెండు గంటల పాటు ఈ రోడ్‌షో కొనసాగుతోంది. రోహిత్‌ బృందం ఓపె్ బస్సులో కప్పుతో అభిమానులు అభివాదం చేస్తారు. రాత్రి వాంఖడే స్టేడియంలో భారత జట్టుకు బీసీసీఐ సన్మాన కార్యక్రమం నిర్వహిస్తుంది.

Next Story