టీమ్ఇండియా సెలబ్రేషన్స్ చూశారా..?
Team India players celebrate ODI series clean sweep against Zimbabwe.జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్
By తోట వంశీ కుమార్
జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది టీమ్ఇండియా. సోమవారం జరిగిన ఆఖరి వన్డేలో 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో భారత ఆటగాళ్లు సంతోషంలో మునిగిపోయారు. తెగ సంబరాలు చేసుకున్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లో బాలీవుడ్ పాట "కాలా చష్మా" సాంగ్‌కు శిఖర్ ధవన్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ సహా ఆటగాళ్లు అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓపెనర్ శిఖర్ ధవన్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి అభిమానులతో పంచుకున్నాడు. "విజయాన్ని మేము ఇలా సెలబ్రెట్ చేసుకుంటున్నాం." అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ వన్డేల్లో తన తొలి శతకాన్ని(130) అందుకోగా ఇషాన్ కిషన్(50), ధావన్(40) లు రాణించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ ఐదు వికెట్లు తీయగా న్యౌచీ, జోంగ్వే చెరో వికెట్ పడగొట్టారు. 290 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 49.3 ఓవర్లలో 276 పరుగులకు కుప్పకూలింది. జింబాబ్వే బ్యాటర్లలో సికందర్ రజా(115) తన జట్టును గెలిపించుకునేందుకు వీరోచిత పోరాటం చేసినా మరో ఎండ్‌లో అతడికి సహకరించేవారు కరువు అవ్వడంతో గెలుపు అంచుల వరకు వచ్చి బోల్తా పడింది. భారత బౌలర్లలో ఆవేశ్ ఖాన్ మూడు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.