మరో ఏడాది వరకు టీమిండియా బిజీ..మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో విజేతగా నిలిచింది భారత్.
By Srikanth Gundamalla Published on 2 July 2024 11:31 AM ISTమరో ఏడాది వరకు టీమిండియా బిజీ..మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో విజేతగా నిలిచింది భారత్. జూన్ 28వ తేదీని మర్చిపోలేని డేట్‌గా మిగుల్చుకుంది. 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫిని అందుకుంది టీమిండియా. అంతకుముందు 2013లో చాంపియన్స్ ట్రోఫీని అందుకున్న తర్వాత.. రోహిత్ శర్మ సారథ్యంలో ఇప్పుడు పొటి ప్రపంచ కప్‌ను ముద్దాడింది. సౌతాఫ్రికాపై జరిగిన ఫైనల్‌లో సమిష్టి ప్రదర్శనతో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇక మరో ఏడాది వరకు టీమిండియా బీజీా ఉండనుంది.
జులై 6వ తేదీ నుంచి జింబాబ్వేతో మ్యాచ్‌లు ఆడనుంది భారత్. ఆ తర్వాత శ్రీలంక పర్యటనకు వెళ్తుంది. ఈ పర్యటనలతో టీ20 ఫార్మాట్‌లో కొత్త శకం ప్రారంభం అవుతుంది. టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియాలో భారీ మార్పులు జరిగాయి. టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రోహిత్, కోహ్లీ, జడేజా గుడ్‌బై చెప్పారు. అలాగే టీమిండియా హెడ్‌కోచ్ ద్రవిడ్ పదవీ కాలం కూడా ముగిసింది. ప్రస్తుతం జింబాబ్వే టూర్‌కు ఎన్‌సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరిస్తారు. ఆ తర్వాత శ్రీలంక పర్యటనకు కొత్త కోచ్ వస్తాడని తెలుస్తోంది.
వచ్చే ఏడాదే ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ప్రస్తుతం భారత్ ఆస్ట్రేలియా పర్యటనతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది. బీసీసీఐ సెక్రటరీ జైషా కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ వరకు సీనియర్ ఆటగాళ్లు ఆడుతారని తెలిపాడు. ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు డబ్ల్యూటీసీ టైటిల్ గెలవడమే టీమిండియా తదుపరి లక్ష్యాలుగా ఆయన పేర్కొన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు టీమిండియా 20 టీ20లు, 10 టెస్ట్‌లు, 6 వన్డేలు ఆడనుంది. 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించనున్నారు. వన్డే ఫార్మాట్‌లోనే ఈ టోర్నీ జరిగే అవకాశం ఉంది. ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. పాకిస్థాన్‌కు భారత్ వెళ్తుందా? లేదా? అనేదానిపై సందిగ్దత నెలకొంది.
ఐపీఎల్ 2025 వరకు భారత షెడ్యూల్:
జూలై 6 నుంచి 14 వరకు జింబాబ్వే పర్యటనలో ఐదు టీ20ల సిరీస్
శ్రీలంక పర్యటన: 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ (షెడ్యూల్ ప్రకటించలేదు )
భారత్‌కు రానున్న బంగ్లాదేశ్: రెండు టెస్ట్‌లు, 3 టీ20లు (సెప్టెంబర్-అక్టోబర్)
భారత్‌కు రానున్న న్యూజిలాండ్: మూడు టెస్ట్‌లు (అక్టోబర్, నవంబర్)
భారత్ సౌతాఫ్రికా పర్యటన: 4 టీ20ల సిరీస్ (నవంబర్)
భారత్ ఆస్ట్రేలియా పర్యటన: ఐదు టెస్ట్‌ల సిరీస్ (నవంబర్/డిసెంబర్/ జనవరి 2025)
భారత పర్యటనకు ఇంగ్లండ్ మూడు వన్డేలు, 5 టీ20లు (జనవరి/ ఫిబ్రవరి 2025)
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (ఫిబ్రవరి/మార్చి 2025)
మార్చి చివరి వారం నుంచి ఐపీఎల్ 2025 సీజన్ ఉండనుంది.