IND Vs ENG: పోప్ డబుల్ సెంచరీ మిస్.. ఇండియా టార్గెట్ ఎంతంటే..
భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ జరుగుతోన్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla
IND Vs ENG: పోప్ డబుల్ సెంచరీ మిస్.. ఇండియా టార్గెట్ ఎంతంటే..
భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ జరుగుతోన్న విషయం తెలిసిందే. తొలి టెస్టు మ్యాచ్ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా కొనసాగుతుంది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 420 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 102.1 ఓవర్లలో 420 పరుగులు చేసిన ఇంగ్లండ్ టీమ్ 230 పరుగుల ఆధిక్యంలో ఉంది. కాగా.. తొలి టెస్టులో విజయం కోసం భారత్ 231 పరుగులు చేయాల్సి ఉంది.
ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ పోప్ రాణించాడు. 278 బంతులను ఎదుర్కొన్న అతను 196 పరుగులు చేశాడు. బుమ్రా ఓవర్‌లో చివరన స్వీప్ షాట్ కొట్టి ఫోర్ కొడదామనుకున్న పోప్ వికెట్ కోల్పోయాడు. దాంతో.. అతను డబుల్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఇక బెన్ డకెట్ (47), బెన్ ఫోక్స్ (34), టామ్ హార్ట్‌లీ (34), క్రావ్‌లీ (31), రెహాన్ అహ్మద్ (28) పరుగులు చేశారు. బుమ్రా 4 వికెట్లు తీయగా.. అశ్విన్‌కు 3, జడేజాకు 2, అక్షర్ పటేల్‌కు ఒక వికెట్ పడ్డాయి. ఇక మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 64.3 ఓవర్లలో 246 పరుగులు చేసి ఆలౌట్ అయ్యిన విషయం తెలిసిందే. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 436 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత లీడ్‌లోకి వచ్చినా కూడా.. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ పోప్ విజృంభించడంతో వారికి 230 పరుగుల ఆధిక్యం లభించింది.
కాగా.. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి, కేఎల్ రాహుల్, జడేజా ముగ్గురు 80కి పైగా పరుగులు చేసి సెంచరీని మిస్ చేసుకున్నారు. ఇక నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ఇండియా కాసేపట్లో ప్రారంభించనుంది. 231 పరుగులు చేస్తే ఇండియా తొలి టెస్టులో విజయం ఖరారు చేసుకోనుంది.