ఇంగ్లండ్ మూడో టెస్టుకు విరాట్ వచ్చేస్తున్నాడు..!
విశాఖలో ఇంగ్లండ్‌తో ప్రస్తుతం టీమిండియా రెండో టెస్టు మ్యాచ్ ఆడుతోంది.
By Srikanth Gundamalla Published on 5 Feb 2024 11:27 AM ISTఇంగ్లండ్ మూడో టెస్టుకు విరాట్ వచ్చేస్తున్నాడు..!
విశాఖలో ఇంగ్లండ్‌తో ప్రస్తుతం టీమిండియా రెండో టెస్టు మ్యాచ్ ఆడుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో తొలి టెస్టు మ్యాచ్‌లో గెలిచిన ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలో ఉంది. విశాఖ టెస్టులో ఎలాగైనా గెలిచి 1-1తో సమం చేసి సిరీస్ గెలవాలని భారత్ భావిస్తోంది. సోమవారం నాలుగో రోజే రెండు టెస్టులో విజేతలెవరో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కాగా.. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది టీమిండియా. జట్టులో ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఉంటే బాగుండేదని టీమిండియా అభిమానులంతా భావిస్తున్నారు. విరాట్ ఎక్కడున్నారు? ఎప్పుడు తిరిగి వస్తాడని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టుకు వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉన్న విరాట్.. ఇప్పుడు తర్వాత మ్యాచ్‌లను ఆడటం లేదని ఈ మేరకు అతను నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే.. తాజాగా ఇదే విషయంపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు స్పందించారు. క్లారిటీ ఇచ్చారు.
మూడు టెస్టు మ్యాచ్‌లకు విరాట్ దూరంగా ఉంటారనే వార్తలన్నీ రూమర్సే అని బీసీసీఐ అధికారి వాటిని కొట్టిపాడేశారు. అతను మొదటి రెండు టెస్టుల నుంచి మాత్రమే బోర్డుకు సమాచారం ఇచ్చారని చెప్పారు. ఒకవేళ విరాట్ నుంచి ఎలాంటి సమాచారం లేదంటే జట్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉన్నట్లేఅని చెప్పారు. తద్వారా విరాట్ మూడో టెస్టు మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. కాగా.. ఈ విషయంలో ఒకట్రెండు రోజుల్లో పూర్తి క్లారిటీ వస్తుందని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.