దక్షిణాఫ్రికాకు బయల్దేరిన టీమ్ఇండియా.. విరాట్ ఎక్కడంటూ ఫ్యాన్స్ ఫైర్
Team India departs Johannesburg BCCI shares pics.కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయం, కెప్టెన్సీ వివాదం వంటి ఇబ్బందికర
By తోట వంశీ కుమార్ Published on 16 Dec 2021 3:12 PM ISTకరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయం, కెప్టెన్సీ వివాదం వంటి ఇబ్బందికర పరిస్థితుల్లో టీమ్ఇండియా దక్షిణాఫ్రికా పర్యటనకు బయలేర్దింది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని టెస్టు జట్టు దక్షిణాఫ్రికాతో తలపడేందుకు గురువారం ఉదయం సౌతాఫిక్రా ఫ్లైట్ ఎక్కింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. అయితే.. ఈ ఫోటోల్లో ఎక్కడా కూడా టెస్టు కెప్టెన్ కోహ్లీ కనిపించలేదు. దీంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుపై అభిమానులు మండిపడుతున్నారు. అందరు ఆటగాళ్లు ఉన్నారు. విమానంలో కోహ్లీ ఎక్కడున్నాడో మీకు కనిపించలేదా..? అని కామెంట్లు పెడుతున్నారు.
అంతకముందు విరాట్ మీడియాతో మాట్లాడుతూ.. వన్డే కెప్టెన్సీ విషయంలో తనను ఎవరూ సంప్రదించలేదన్నాడు. తనను తొలగించడానికి కేవలం గంటన్నర ముందు మాత్రమే సమాచారం ఇచ్చారన్నాడు. దీనిపై బీసీసీఐ ఘాటుగానే స్పందించింది. కోహ్లీతో ఈ విషయం గురించి చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ మాట్లాడారని బీసీసీఐ తెలిపింది. దీంతో పరిస్థితి మరింత వివాదాస్పదమయింది. ఎవరు చెప్పేది నిజమో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. విరాట్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి.. ఆ బాధ్యతలను రోహిత్‌కు అప్పజెప్పడంతో వివాదం మొదలైంది. ఈ విషయాన్ని రెండు రోజుల ముందే కోహ్లీకి చెప్పినట్లు బీసీసీఐ అంటుండగా.. కేవలం గంటన్నర ముందే చెప్పినట్లు విరాట్ చెప్పడంతో బోర్డుకు, కోహ్లీకి మధ్య విభేదాలు ఉన్నారని అర్థం అవుతోంది. మరీ అన్ని మరిచి అందని ద్రాక్షగా ఉన్న సౌతాఫిక్రాలో టెస్టు సిరీస్ విజయాన్ని కోహ్లీ అందిస్తాడో లేదో చూడాలి మరీ.
All buckled up ✌🏻
— BCCI (@BCCI) December 16, 2021
South Africa bound ✈️🇿🇦#TeamIndia #SAvIND pic.twitter.com/fCzyLzIW0s
టీమ్ఇండియా.. దక్షిణాఫ్రికాలో ఇప్పటి వరకు 20 టెస్టులు ఆడింది. అందులో మూడు మాత్రమే గెలిచింది. 2018 పర్యటలో ఓ టెస్టు మ్యాచ్‌ను గెలిచినప్పటికి 1-2తో సిరీస్ ను కోల్పోయారు. డిసెంబర్ 26 నుంచి మూడు టెస్టు మ్యాచుల సిరీస్ ప్రారంభం కానుండగా.. జనవరి 19 నుంచి భారత్, మూడు మ్యాచుల వన్డే సిరీస్ జరగనుంది. అయితే.. గాయం కారణంగా రోహిత్ శర్మ టెస్టు సిరీస్‌కు దూరం అవ్వగా.. వన్డే సమయానికి కోలుకుంటాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.