ఎన్టీఆర్‌తో టీమ్ఇండియా క్రికెట‌ర్లు.. బ్ర‌ద‌ర్ అంటూ సూర్య ట్వీట్‌

Team India cricketers meet RRR star Jr NTR in Hyderabad.భారత ఆట‌గాళ్లు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ను క‌లిశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Jan 2023 9:40 AM GMT
ఎన్టీఆర్‌తో టీమ్ఇండియా క్రికెట‌ర్లు.. బ్ర‌ద‌ర్ అంటూ సూర్య ట్వీట్‌

జ‌న‌వ‌రి 18న భార‌త్, కివీస్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న తొలి వ‌న్డేకు హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ స్టేడియం వేదిక కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్ప‌టికే ఇరు జ‌ట్ల‌కు చెందిన ఆట‌గాళ్లు హైద‌రాబాద్ న‌గ‌రానికి చేరుకున్నారు. అంతేకాకుండా త‌మ ప్రాక్టీస్‌ను కూడా మొద‌లెట్టేశారు. మంగ‌ళ‌వారం టీమ్ఇండియా ఆట‌గాళ్లు కాస్త సేద తీరారు. ఈ క్ర‌మంలో ప‌లువురు భారత ఆట‌గాళ్లు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ను క‌లిశారు. మిస్ట‌ర్ 360 డిగ్రీస్ ఆట‌గాడు సూర్య‌కుమార్ యాద‌వ్‌, శుభ్‌మ‌న్ గిల్‌, ఇషాన్ కిష‌న్‌, య‌జ్వేంద్ర చ‌హ‌ల్, శార్దూల్ ఠాకూర్‌ల‌తో ఎన్టీఆర్ కాసేపు ముచ్చ‌టించారు.

ఎన్టీఆర్‌తో సూర్య‌కుమార్ యాద‌వ్ దంప‌తులు ఫోటో దిగారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెల‌వ‌డం ప‌ట్ల సూర్య కుమార్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశాడు. "మిమ్మ‌ల్ని క‌ల‌వ‌డం చాలా సంతోషంగా ఉంది బ్ర‌ద‌ర్‌. ఆర్ఆర్ఆర్ గోల్డోన్ గ్లోబ్ అవార్డు గెలిచినందుకు మీరో మ‌రోసారి శుభాకాంక్ష‌లు" అంటూ సూర్య ఎన్టీఆర్‌తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ ట్వీట్ చేశాడు. దీనికి.. "ధ‌న్య‌వాదాలు సూర్య‌.. రేపు (న్యూజిలాండ్‌తో) మ్యాచ్‌లో అద‌ర‌గొట్టాలి" అంటూ ఎన్టీఆర్‌ కామెంట్ పెట్టాడు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి ట్వీట్లు వైర‌ల్‌గా మారాయి. అటు క్రికెట్‌, ఇటు ఎన్టీఆర్ అభిమానులు ఈ ఫోటోలు చూసి ఉప్పొంగిపోతున్నారు.

Next Story
Share it